నచ్చినవాళ్లను ప్రేమించడం ఒకెత్తయితే.. వాళ్లు తమ ప్రపోజల్‌కు ఓకే చెబుతారో లేదోననే టెన్షన్ యూత్‌లో ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ నో అంటే కుంగిపోవడం, డిప్రెషన్‌లోకి వెళ్లిపోవడం లాంటివి చూస్తూనే ఉన్నాం. ఇక ఎస్ చెబితే ఎంచక్కా లవ్ లైఫ్‌ను ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ప్రేమించిన వారితో ఫోన్‌లో మాట్లాడినా, బయట కలిసినా.. ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఎవరైనా చూస్తారేమోనని భయపడుతుంటారు. తమ ప్రేమ గురించి ఇంట్లోవాళ్లకు తెలిస్తే గొడవలు అవుతాయేమోనని ఆందోళనకు గురవుతారు. ఈ భయాన్ని క్యాష్ చేసుకునేందుకు కొందరు కేటుగాళ్లు ప్రేమికులను బెదిరిస్తుంటారు. ఇలాంటి ఓ ఘటనే ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో చోటుచేసుకుంది. ప్రేమికులను బెదిరిస్తూ వారి దగ్గర నుంచి డబ్బులను దోచేస్తున్నాడో నకిలీ పోలీసు.
పోలీసు అనే ముసుగులో పోకిరీ వేషాలు వేస్తున్న అతడి పేరు సునీల్. వైజాగ్‌లోని రిషికొండ బీచ్‌కు వచ్చే జంటల్లో ఎవరైనా అమాయకంగా కనిపిస్తే వారిని బెదిరిస్తున్నాడు. మీ పేర్లేంటి? మీ పేరెంట్స్ ఎవరు? మీకు ఇక్కడేం పని అంటూ వాకబు చేస్తున్నాడు. పోలీసునంటూ బెదిరిస్తుండటంతో తమ ప్రేమ గురించి ఇంట్లో పెద్దలకు తెలుస్తుందేమోననే భయంతో సునీల్‌కు లవర్స్ డబ్బులు ఇచ్చేస్తున్నారు. కానీ తాజాగా కొందరు తిరగబడి అతడిపై దాడి చేశారు. దీంతో తన నిజస్వరూపం బయటపెట్టాడు సునీల్. తాను నిజమైన పోలీసును కాదని చెప్పాడు. ఒక ఏఆర్ కానిస్టేబుల్ అండతోనే సునీల్ ఈ విధంగా లవర్స్‌ను బెదిరిస్తూ.. అందినకాడికి దండుకుంటున్నాడని సమాచారం. సునీల్‌ను అరెస్టు చేసిన పోలీసులు.. ఈ కేసులో విచారణ జరిపి, ఆ ఏఆర్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేస్తామని చెప్పారు. మరి, ఇలాంటి సంఘటనలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.