తెలుగు గడ్డపై పుట్టి స్వాతంత్ర ఉద్యమంలో బ్రిటీష్ వారిని గడ గడలాడించిన మన్యం వీరుడు అల్లూరి సీతారారమరాజు 125వ జయంతి వేడుకలు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా భీమవరం అల్లూరి జయంతిలకు భారత ప్రధాని విచ్చేయుచున్నారు. ఈ సందర్బంగా క్షత్రియ సేవా సమితి ఏర్పాటు చేసిన విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు 30 అడుగుల కాంస్య విగ్రహాన్ని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఆవిష్కరించారు.
ఈ ప్రత్యేక కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజు వారసులు రాబోతున్నారు. ఆయన సోదరుడు అల్లూరి సత్యనారాయణ రాజు తో పాటు కుటుంబ సభ్యులు అందరూ భీమవరానికి పిలిపించారు. అంతేకాదు విప్లవ వీరుడు అల్లూరికి వెన్నుదన్నుగా నిలిచిన ఆయన ప్రధాన అనుచరుడు గంటదొర వారసులతో పాటు మరికొంత మందిని ప్రధాని నేరుగా కలవనున్నారు.
ప్రధాని భీమవరం పర్యటనకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కేంద్ర బలగాలతో పాటు రాష్ట్ర పోలీసులను భారీగా మోహరించారు. దాదాపు 3వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన కాపలా పెట్టారు. ఎవరూ లోనికి ప్రవేశించడానికి వీలు లేకుండా బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్బంగా ప్రధాని మాట్లాడుతూ.. బ్రీటీష్ వారిని ఎదురించి పోరాడిన గొప్ప వీరుడు ల్లూరి సీతారామరాజు… అలాంటి వ్యక్తి పుట్టిన స్థలానికి రావడం నా అదృష్టమన్నారు. ఆంధ్ర రాష్ట్రానికే అల్లూరి గౌరవకారణమని చెప్పారు ప్రధాని మోడీ. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Prime Minister Narendra Modi unveiled a bronze statue of freedom fighter Alluri Sitarama Raju, at a special program on his 125th birth anniversary celebrations, in Bhimavaram, Andhra Pradesh. pic.twitter.com/jsEMoVctKM
— ANI (@ANI) July 4, 2022