ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయానక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అక్కడ భద్రతా లోపం సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటనలు గురించి విన్నాం. తాజాగా మరో ఆసుపత్రిలో..
ఇటీవల ప్రభుత్వ ఆసుపత్రుల్లో భయానక సంఘటనలు వెలుగు చూస్తున్నాయి. అక్కడ భద్రతా లోపం సుస్పష్టంగా కనిపిస్తుంది. అప్పుడే పుట్టిన పిల్లలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించిన ఘటనలు గురించి విన్నాం. తాజాగా మరో ఆసుప్రతిలో అర్థరాత్రి ఓ వ్యక్తి హల్ చల్ చేయడం సంచలనంగా మారింది. అనకాపల్లి జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో మంగళవారం అర్ధరాత్రి వ్యక్తి చొరబడటం.. భద్రతా వైఫల్యాలపై వెలేత్తెలా చేసింది. గైనిక్ వార్డులోకి చొరబడటమే కాకుండా వీరంగం సృష్టించాడు. రాళ్లతో కిటికీ అద్దాలను పగులకొట్టాడు.అతడి వీరంగంతో ఆ వార్డులో ఉన్న మహిళలు అరవడం మొదలు పెట్టారు.
ఎన్టీఆర్ ప్రభుత్వాసుపత్రిలో ఓ వ్యక్తి వీరంగం సృష్టించాడు. గైనిక్ వార్డు దగ్గర చేసిన అలజడితో బాలింతలు, గర్బిణీలు, వారికి సహాయంగా వచ్చిన మహిళలు భయాందోళనకు గురయ్యారు. సైకో వీరంగాన్ని చూసి భయపడి పరుగులు తీసి సెక్యూరిటీకి సమాచారం అందించారు. ఈ నేపథ్యంలో సెక్యూరిటీ సిబ్బంది వ్యక్తిని పట్టుకుని తాళ్లతో కట్టేశారు. అతడు ఒడిశాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మానసిక స్థితి సరిగ్గా లేకపోవడంతో విశాఖ కేజీహెచ్‌కు వైద్యం నిమిత్తం హాస్పిటల్స్ సూపరిండెంట్ శ్రావణ్ కుమార్ పంపించారు. ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించారు.