మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది. మంత్రిగా బాధ్యత గల పదవిలో వుండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని.. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అన్న దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీఎంఓ హెచ్చరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ విషయపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రి సీదిరి అప్పలరాజును మందలించినట్లు తెలుస్తోంది.
‘వైజాగ్ స్టీల్ ప్లాంట్’ ప్రైవేటీకరణ అంశం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య చిచ్చు రేపుతోంది. రోజుకో ములుపు తిరుగుతున్న ఈ వ్యవహారంలో ఇరు రాష్ట్రాల నాయకులు మాటల యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. ఏపీలో పాలన అస్తవ్యస్తంగా ఉందని, అక్కడి పరిస్థితులు బాగోలేవంటూ.. తెలంగాణ మంత్రి హరీష్ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘ఏపీ, తెలంగాణల మధ్య భూమి, ఆకాశానికి వున్నంత తేడా వుందన్న ఆయన.. ‘’ఏపీతో పోలిస్తే తెలంగాణలోని ఆసుపత్రులు, రోడ్లు, సేవలు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నాయో మీ అందరికీ బాగా తెలుసన్నారు. ఏపీలో ఓటు హక్కు రద్దు చేసుకొని తెలంగాణలో తీసుకోవాలన్నారు’. ఈ వ్యాఖ్యలపై ఏపీ మంత్రులు అదే స్థాయిలో రెచ్చిపోతున్నారు. ముఖ్యంగా ఏపీ మంత్రి సీదిరి అప్పలరాజు.. హరీష్ రావు, కెసిఆర్, కేటీఆర్ ఉద్దేశిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
హరీశ్ రావు వ్యాఖ్యలకు బదులిస్తూ మాట్లాడిన మంత్రి సీదిరి అప్పలరాజు.. కాస్త ఎక్కువగానే రియాక్ట్ అయ్యారు. సీఎం కేసీఆర్ కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు చేశారు. ‘నువ్వు (హరీశ్ రావు), మీ మామ (కేసీఆర్), మీ మామ కొడుకు (కేటీఆర్), మీ మామ కూతురు (కవిత) మీరంతా ప్రాంతీయ ఉగ్రవాదులంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పనికిమాలిన మాటలు ఆపి.. మీ పని మీరు చూసుకోవాలని హెచ్చరించారు. ఆంధ్రవాళ్లు తెలంగాణకు రావడం ఆపేస్తే.. అక్కడ అడుక్కుతినడం తప్ప ఏం వుండదని వ్యాఖ్యానించారు’. ఈ వ్యాఖ్యలపై తెలంగాణ మంత్రులు, బీఆర్ఎస్ నేతలు భగ్గుమన్నారు. ఈ క్రమంలో అప్రమత్తమైన ఏపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టింది.
మంత్రిగా బాధ్యత గల పదవిలో వుండి ఏది పడితే అది మాట్లాడటం సరికాదని.. నేతల స్థాయి ఏంటి, ఏం మాట్లాడుతున్నాం అన్న దానిని దృష్టిలో ఉంచుకుని మాట్లాడాలంటూ సీఎంఓ హెచ్చరించినట్లు కథనాలు వస్తున్నాయి. ఇదిలావుంటే ఈ విషయపై ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మంత్రి సీదిరి అప్పలరాజును మందలించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మంత్రి పేర్ని నాని మీడియాకు తెలియజేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావులపై మంత్రి చేసిన వ్యాఖ్యలు భాదించాయన్న ఆయన.. ‘మా నాయకుడు అది తప్పు.. అలా మాట్లాడుకూడదని తెలిపినట్లు ఆయన మీడియాకు తెలియపరిచారు.
కేసీఆర్ మీద వ్యక్తిగత వ్యాఖ్యలు మంత్రి అప్పలరాజును మా సీఎం జగన్ గారు మందలించారు – మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని https://t.co/kx7cgNUFH5 pic.twitter.com/i7wWGODQ34
— Telugu Scribe (@TeluguScribe) April 13, 2023