ఆంధ్రప్రదేశ్ లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని గురించి ప్రత్యేక పరిచయం అక్కరలేదు. సీఎం జగన్ కి ఎంతో విధేయుడిగా ఉండేవారిలో పేర్నినాని ఒకరు అంటారు. ప్రతిపక్ష నేతలపై తనదైన మాటల తూటాలు పేలుస్తుంటారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాల భలే రసవత్తరంగా సాగుతున్నాయి. రాబోయే ఎన్నికలకు ఇప్పటి నుంచి అన్నిరకాలుగా అధికార, ప్రతిపక్ష పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో భారీ బహిరంగ సభలు, ర్యాలీలు, పాదయాత్రల వంటి కార్యక్రమాలు చేపడబుతూ ప్రజల్లోకి వెళ్తున్నారు అధికార, ప్రతిపక్ష పార్టీ నేతలు. తాజాగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వివరాల్లోకి వెళితే..
ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. మచిలీపట్నం సభలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బందర్ పోర్ట్ లో పనులకు నేడు శంకు స్థాపన చేశారు సీఎం జగన్. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలోలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని, ఎంపి బాలశౌరి తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా తన రాజకీయ భవితవ్యంపై పేర్ని నాని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ వైపు జగన్ పై ప్రశంసలు కురిపిస్తూనే తనకు జగన్ తో బహుషా ఇదే చివరి మీటింగ్ కావొచ్చు.. ఆయనతో కలిసి సభలో పాల్గొనే అవకావం ఉండకపోవొచ్చు అందుకే ఇంతసేపు మాట్లాడుతన్నా అంటూ వ్యాఖ్యలు చేయడంతో సభలో కూర్చున్న సీఎం జగన్ తో సహా అందరూ ఆశ్చర్యపోయారు.
పేర్ని నాని మాట్లాడుతున్న సమయంలో ఎంపి బాలశౌ, ఎమ్మెల్సీ రఘురాం తో సహా మరికొంతమంది పేర్ని నానిని వెనుక నుంచి వారించారు. కానీ ఆయన మాత్రం ఆపకుండా తన ప్రసంగాన్ని చాలా ఎమోషనల్ గా కొనసాగించారు. మరి పేర్ని నాని రాజకీయాల నుంచి ఇక రిటైర్ అయిపాతానన్న సంకేతాలు ఇచ్చారా అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. ఇక తన ప్రసంగంలో సీఎం జగన్ ని ప్రశంసలతో ముంచెత్తారు. జగన్ పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ వచ్చారు. రూ. 1,156 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న బందర్ పోర్ట్ పనులు శంకుస్థాపన చేశారు. బందరు అభివృద్దికి ఆయన శ్రీకారం చుట్టారు. ఇక బందరు కు పూర్వ వైభవం రాబోతుంది. ఏపీలో 31 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన నాయకుడు దేశంలో ఎవరూ లేరు.. సీఎం జగన్ ఏది చెబుతారో.. అది చేసి చూపిస్తారంటూ మాట్లాడారు పేర్నినాని.