ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారని మాజీ మంత్రి పేర్నినాని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోటంరెడ్డి ఫోన్‌ను ఎవరూ ట్యాప్ చేయలేదని, ఆయన స్నేహితుడే కాల్ రికార్డింగ్ చేశాడని చెప్పారు. పేర్నినాని గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ రామశివారెడ్డి అనే కాంట్రాక్టర్ కోటం రెడ్డికి అత్యంత సన్నిహితుడు. అతడు సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అభిమాని. అతడు కోటంరెడ్డి కాల్స్‌ను రికార్డ్ చేశాడు. పార్టీలో అందరికీ సర్క్యులేట్ చేశాడంట. టాప్ చేశారు అన్న దానికి ఆధారాలు చూపించమనండి. పంపిన వాళ్లు ‘‘ప్లీజ్ చెక్’’ అని వీడియోతో పాటు ఓ మెసేజ్ కూడా పెట్టారు. అది కాల్ రికార్డింగ్ అని నెల్లూరులోని ప్రతీ వైఎస్సార్ సీపీ నేతకు తెలుసు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి కోటంరెడ్డి అంటే విపరీతమైన ప్రేమ ఉంది. అందుకే మాలాంటి వారు కోటంరెడ్డి గురించి చెప్పినా ఆయన పట్టించుకోలేదు. మీ అంతరాత్మను మీరు ప్రశ్నించుకోండి. కోటంరెడ్డి డిసెంబర్ 25న బ్లూ కలర్ బెంజ్ కారులో చంద్రబాబు ఇంటికి వెళ్లి వచ్చాడు. రెండు గంటల పాటు మాట్లాడి వెళ్లాడు. నారాయణతో టచ్‌లో ఉండమని ఆయనకు చంద్రబాబు చెప్పారంట. ఈ విషయాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులే చెబుతున్నారు. లోకేష్‌తో ఆయన ఫుల్‌గా టచ్‌లో ఉన్నారు. సీఎం జగన్ మాత్రం కోటం రెడ్డిని బాగా నమ్మారు. ‘నా మనిషి ఎక్కడికి పోడు’ అని అనుకుంటూ ఉన్నారు.
జగన్ మోహన్‌రెడ్డి అంటే ఇష్టపడేవాళ్లు లోకేష్‌తో మాట్లాడతారా?. కోటంరెడ్డి, లోకేష్ రోజూ మాట్లాడుకుంటారని టీడీపీ వాళ్లే చెబుతున్నారు. జిగళం యాత్ర కోసం లోకేష్‌కు కోటంరెడ్డి సలహాలు ఇచ్చారంట’’ అని అన్నారు. కాగా, తన ఫోన్‌ను ఏపీ ప్రభుత్వం ట్యాప్ చేయిస్తోందని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆయన టీడీపీలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు చెప్పిన చోటునుంచి పోటీ చేస్తానన్నారు. మరి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మెహన్‌రెడ్డికి కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నమ్మక ద్రోహం చేశారంటున్న మాజీ మంత్రి పేర్నినాని వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.