మంచి బతుకుదెరువు కోసం చాలా మంది సొంత గ్రామాలు వదిలి ఇతర రాష్ట్రాలకు, పట్టణాలక వలస వెళ్లిపోతుంటారు. కొంతమంది ఉన్నత చదువుల కోసం గ్రామాలు వదిలి వెళ్తుంటారు.
సాధారణంగా గ్రామాల నుంచి ఇతర పట్టణాలకు వలస వెళ్లేవారు ఎంతో మంది ఉన్నారు. గ్రామాల్లో సరైన వసతి లేకపోవడం, కరువు కాటకాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల కొంతమంది సొంత ఊరు వదిలి వేరే ఊర్లోకి మకాం మారుస్తుంటారు. దీంతో చాలా గ్రామాలు ఖాళీగా మారిపోతుంటాయి. ఏళ్ల పాటు ఇంటి తలుపు తట్టేవారు ఉండరు. ఇటీవల ఏపిలో కొన్ని గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.. దీని వెనుక ఉన్న కారణం ఏంటో తెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..
ఒకప్పుడు గ్రామాల్లో సరైన విద్యావకాశాలు లేక పోవడం, పంటలు సరిగా పండకపోవడం వల్ల ప్రజలు గ్రామాల నుంచి వలస వెళ్లడం అనేది కొనసాగుతూనే వుంది. గ్రామాల్లో పిల్లలు ఒకస్థాయిలో చదువుకోవడానికి చాలా ఇబ్బందులు పడేవారు.. తమ గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్లి చదువుకోవడం, సరైన బస్సు సౌకర్యాలు ఉండకపోవటం ప్రతి ఒక్కటీ సమస్యగానే ఉండేవి. దీంతో చాలా మంది తమ కుటుంబాలతో గ్రామాలు వదిలి పట్టణాలకు వలస వెళ్లేవారు. ఈ క్రమంలోనే సొంతఊరు పూర్తిగా ఖాళీ చేసి ఉన్న భూములు అమ్ముకొని పట్టణాల్లో స్థిరపడుతున్నారు. సొంత ఇళ్లు, భూములు అలాగే వదిలి పక్క రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. కొన్ని కుటుంబాల్లో పిల్లలు ఉన్నత చదువులు చదువుకొని విదేశాల్లో స్థిరపడ్డావాళ్లు ఉన్నారు. ఉన్న ఊరు వదిలి ఇతర రాష్ట్రాలు, విదేశాలకు వెళ్లిపోతున్న వారి సంఖ్య తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా జరుగుతున్నాయని గ్రామంలో ఉన్న ప్రజలు వాళ్ల భాదను వ్యక్తపరుస్తున్నారు.
ఏపీలో గుంటూరు జిల్లా అమృతనూరు మండలం తురిమెల్ల గ్రామంలో వందేళ్ల క్రితమే బ్రిటీష్ కాలంలో విద్యాసంస్థలు ఏర్పాటుచేశారు. అప్పట్లో ఈ విద్యాసంస్థలో చదివిన వారు ఉన్నతవిద్యావంతులై విదేశాల్లో మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడిపోయారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని చాలా మంది అదే మార్గాన్ని అనుసరించారు. దీంతో చాలా మంది సొంత ఊరు వదిలి విదేశాల్లో స్థిరపడిపోవడంతో ప్రస్తుతం గ్రామంలో కొన్ని ఇండ్లకు తాళాలు వేస్తే తీసే నాదుడే లేకుండా పోయారు. ఇది ఒక తురిమెల్లా గ్రామమే కాదు. చుట్టుపక్కల చాలా గ్రామాల పరిస్థితి ఇదే. గ్రామాల్లో ఏముంది అని ఈ కాలంలో ఉన్న పిల్లలు వెళ్లడానికి కూడా ఆసక్తి చూపడం లేదు.
తురిమెల్ల గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి అనే ఓ వ్యక్తికి ముగ్గురు సంతానం. అందరూ ఉన్నత విద్యనభ్యసించి విదేశాల్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. దాంతో తల్లిదండ్రులు ఒంటరి కావడంతో వారు గ్రామంలో జీవించలేక పట్టణానికి వచ్చి బతుకుతున్నామని రామచంద్రారెడ్డి అన్నారు. చాలా మంది తల్లిదండ్రుల పరిస్థితి ఇలాగే ఉందని.. చాలా కొద్దిమంది మాత్రమే విదేశాలకు తమ తల్లిదండ్రులను తీసుకు వెళ్తుంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలే అమెరికాలో తెలుగు భాష ప్రాముఖ్యత అధికంగా ఉంది. అమెరికా వెళ్లెందుకు గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్(GRE) కి హాజరయ్యే వాళ్లు సగం మంది భారతీయులే ఉన్నారు. అందులోనూ జీఆర్ఇ టెస్ట్ కి హాజరయ్యే వారిలో హైదరాబాద్ , గుంటూరు వాసులే అత్యధికంగా ఉన్నారు. ఆ తర్వాత వైజాగ్, ఖమ్మం వాసులు టాప్ 10 లో ఉండడం విశేషం. ఇలా పిల్లలు విదేశాలల్లో ఉండడంతో ఊర్లో ఉండే తల్లిదండ్రుల సంఖ్య మరింత పెరిగిపోతుంది. వివిధ దేశాలలో నివసిస్తున్న ప్రజల సంఖ్య క్రమంగా ఎక్కువ అవుతూ వస్తుంది. ఈ ప్రభావం మన తెలుగు రాష్ట్రాల్లోని గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా పడే అవకాశం ఉందని అంటున్నారు.