దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి కూడా ఉప ఎన్నికలు జరగనున్నాయి. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక అనివార్యం అయ్యింది. ఈ నేపథ్యంలో బద్వెల్ లో పోటీకి టీడీపీ, వైసీపీ నేతలను ఇప్పటికే ప్రకటించి గెలుపు కోసం కుస్తీలు పడుతున్నారు పార్టీ అధినేతలు.
ఇదిలా ఉంటే బద్వేల్ ఉప ఎన్నికలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ పోటీ చేయబోతున్నారా అన్న అంశంపై సర్వత్రా చర్చ నడుస్తుంది. ఇటీవల జరిగిన సార్వత్రి ఎన్నికల్లో ఆయన ఒక్క ఎమ్మెల్యేతో సరిపెట్టుకున్నారు. పవన్ కళ్యాణ్ స్వయంగా భీమవరం, గాజువాక నుంచి పోటీ చేసి అపజయం పొందారు. అయితే తాను ప్రజా తీర్పును మనస్పూర్తిగా గౌరవిస్తానని.. ప్రజల కోసం..వారి కష్టాలు తీర్చడం కోసం ప్రభుత్వంతో ఫైట్ చేస్తానని ముందుకు సాగుతున్నారు. జనసేన పార్టీ తరుపు నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా ఉన్నారా..? లేరా? అన్న చందగానే సాగుతుంది. ఈ సమయంలో బద్వేల్ ఉప ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వ పాలన ఇంకా రెండున్నర సంవత్సరాలు ఎలాగూ ఉంది.. ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిస్తే ఆయనకు ఓ పవర్ వస్తుంది.
గతంలో రెండు స్థానాల్లో పోటీ చేసి ఓటమి పాలైనా ఇప్పుడు ఆయనకు ఉన్న ప్రజాబలంతో గెలిచే ఛాన్సులు ఉన్నాయని అంటున్నారు. ఈ మద్య రిపబ్లిక్ మూవీ ఈవెంట్ లో తనని పవర్ స్టార్ అనొద్దని.. తనకు ఏ పవర్ లేదని అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరి ఇలాంటి సమయంలో బద్వేల్ నుంచి ఆయన జనసేన పార్టీ తరుపు నుంచి పోటీ చేసి గెలిస్తే పవర్ వస్తుంది.. అసెంబ్లీకి వెళ్లి ప్రజా వాణి వినిపించే ఛాన్సు వస్తుంది. ప్రస్తుతం ఏపిలో ఉన్న పరిస్థితులపై పవన్ కళ్యాణ్ పోరాటానికి ఓ బలం చేకూరుతుందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి బద్వెల్ ఉప ఎన్నికలో పవన్ కళ్యాణ్ ఎలాంటి స్టాండ్ తీసుకోబోతున్నారు.. ఒకవేళ పోటీ చేస్తే ఆయన వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయి.. ఆయన నిర్ణయం ఎలా ఉండబోతుందో అన్న విషయం చర్చలు నడుస్తున్నాయి. దీనిపై మీ అభిప్రాయాలు.. కామెంట్ల రూపంలో తెలియజేయండి.