తెలుగు ఇండస్ట్రీలో మెగా పవర్ స్టార్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ‘జనసేన’పార్టీ స్థాపించారు. ఈ క్రమంలోనే వైసీపీ ప్రభుత్వంపై సోషల్ మాద్యమాల్లో ఎప్పటికప్పుడు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాడు. తాజాగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై జనసేన అధినత పవన్ కల్యాణ్ మండిపడ్డారు.
‘తాకట్టులో ఆంధ్రప్రదేశ్’ పేరుతో ఆయన పలు వివరాలు పోస్ట్ చేశారు. ‘ఎన్ని వాగ్దానాలు చేసినా.. ఎన్ని అరుపులు అరిచినా .. రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు. పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు.. ఈ మౌలిక ఆర్థిక సూత్రాన్ని వైసీపీ ప్రభుత్వం మరిచినట్టుంది’ అని పవన్ కల్యాణ్ చెప్పారు. ఎన్నికల ముందు వైఎస్ జగన్ ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చారని.. ఆ నమ్మకంతోనే ప్రజలు గెలిపించారని కానీ ప్రభుత్వ పాలనలో ఏపీలో ఆర్థికంగా మరింత లోతులో పడిపోతుందని, నవరత్నాల పేరిట మాత్రం వరాలు కురిపిస్తున్నామని చెప్పుకుంటోందని పవన్ ఓ గ్రాఫ్ ద్వారా వివరించే ప్రయత్నం చేశారు.
వచ్చే రాబడి లేదు.. కానీ భారీగా ఖర్చులు మాత్రం చేస్తుందని.. అందుకోసం అప్పులు చేస్తోందని, నిత్యావసర సరుకుల ధరలన్నింటినీ పెంచుతూ సామాన్యుల నడ్డి విరుస్తుందని పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన ట్విట్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఎన్ని వాగ్దానాలు చేసినా
ఎన్ని అరుపులు అరిచినా
రాష్ట్ర బడ్జెట్టుని ఎంత మసి పూసి మారేడుకాయ చేసినా‘సంపాదన కన్నా ఎక్కువ ఖర్చుపెట్టలేరు
పండించిన దానికన్నా ఎక్కువ పంచలేరు’ఈ మౌలిక ఆర్ధిక సూత్రాన్ని ‘వైసీపీ ప్రభుత్వం’ మరిచినట్టుంది. pic.twitter.com/S5mHzwizV9
— Pawan Kalyan (@PawanKalyan) October 8, 2021