జనసేన అధినేత పవన్ అధికార వైసీపీ పైన తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు. తాను ఇప్పటికే చేసిన ట్వీట్ గురించి మరో సారి ప్రస్తావిస్తూ వైసీపీ నేతలను గ్రామ సింహాలు అంటూ పేర్కొన్నారు. వైసీపీ గ్రామ సింహాలు అంటూ తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు పవన్ కళ్యాణ్. ఎక్కువగా వాగి పళ్లు రాల్చుకొనే కుక్కలు అని చెప్పుకొచ్చారు. ఈ సన్నాసులకు తల్లిదండ్రులు నేర్పలేని సంస్కారం నేను నేర్పగలనా.. నేను నేర్పలేను అన్నారు. వీళ్లకు సంస్కారం నూనూగు మీసాలు వచ్చిన పిల్లలు నేర్పిస్తారని అన్నారు.
వైసీపీ నేతలకు డబ్బు.. అధికారం.. అహంకారం.. మదం.. మాత్సర్యం బాగా ఉన్నాయి. వాళ్లకు లేనిదల్లా ఒక్క భయం.. ఆ భయం ఎలా ఉంటుందో నేను నేర్పిస్తా అన్నారు పవన్ కళ్యాణ్. అనాల్సినవన్నీ అనేసి.. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి మరీ కొడతాం అన్నారు.. పవన్. అలా వినకుంటూ చట్టప్రకారం పడే శిక్షలు పడేలా చేస్తామన్నారు. నేను పార్టీ పెట్టినప్పటి నుంచి చాలా బాధ్యతగా ఉంటా.. ఉంటున్నా. నాకు బూతులు రాకా కాదు.. మాట్లాడలేకా కాదు.. గుంటూరు బాపట్లలో పెరిగిన వాన్ని నాకు బూతులు రావా.. కానీ సంస్కారం అడ్డు వస్తుందని అన్నారు.
ఈ సందర్భంగా ఆయన ఛలోక్తులు విసిరారు.. తెలంగాణలో ఓ సామెత ఉందని.. అన్నా అల్వాల్ కి ఎట్ట పోవాల్నే అంటే.. ఉల్వలకి దున్నుతున్నా అంటాడు.. అంటే వాడు సరైన సమాధానం ఇవ్వదల్చుకోలేదని అన్నారు. ఇదే క్రమంలో నేను అడిగే ప్రశ్నకు వైసీపీ సమాధానం ఇవ్వకుండా.. బాబూ నేను మీ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి గారు హత్యకు గురయ్యారు.. ఎవరు చంపారు అని అడుగుతున్నా.. దానికి సమాధానం లేదు. కోడి కత్తి కేసు గురించి మాట్లాడితే నా మూడు పెళ్లిళ్ల గురించి ఎందుకు మాట్లాడుతారంటూ ప్రశ్నించారు.