తెలుగు ఇండస్ట్రీలో హీరోగా రంగ ప్రవేశం చేసిన పవన్ కళ్యాన్ తర్వాత రాజకీయాల్లోకి వచ్చారు. జనసేన పార్టీ స్థాపించి ప్రజలకు ఎక్కడ అన్యాయం జరిగినా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా అంటూ ముందుకు వచ్చారు. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి రెండు స్థానాల్లో పోటి చేసిన ఆయన పరాజయం పాలయ్యారు. అయితే ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినా తాను మనసారా శిరసా వహిస్తా అంటూ ప్రజా పోరాటం ఎక్కడా ఆపేది లేదంటూ ముందుకు సాగుతున్నారు.
ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శలు ఎక్కుపెట్టారు. రాష్ట్రంలోని రోడ్ల పరిస్థితి వైసీపీ పాలనలో ‘అడుగుకో గుంత.. గజానికో గొయ్యి’లా మారిందని.. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తాను పర్యటించిన సమయంలో దెబ్బతిన్న రోడ్లే ఎదురయ్యాయని పవన్ కళ్యాన్ విమర్శించారు. తాజాగా ఏపీ ప్రస్తుత పరిస్థితిపై వినూత్న రీతిలో స్పందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పరిస్థితిపై ఓ స్నాప్ షాట్ విడుదల చేశారు. రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు, వివాదాలు, కుంభకోణాలు, వైఫల్యాలకు సంబంధించిన శీర్షికలను పవన్ తన ‘స్నాప్ షాట్’లో చూపించారు.
ఉద్యోగాల్లేవు… గ్రూప్ 1, గ్రూప్ 2లో కేవలం 36 పోస్టులే, జగన్ యువతను మోసం చేశారు, అబద్ధాలు, రాజకీయ ప్రతీకారం, ప్రజాధనం దుర్వినియోగం, మరో వెనిజులా, అక్రమ ఇసుక తవ్వకాలు, యువతను వైసీపీ సర్కారు నిర్లక్ష్యం, అప్పుల ఆంధ్రప్రదేశ్, వైసీపీ నుంచి ఏపీని కాపాడండి, లిక్కర్ మాఫియా, మటన్ దుకాణాలు, సినిమా టికెట్లు, ఆంధ్రాను అమ్మేస్తున్నారు.. దివీస్ ల్యాబ్స్ నుంచి తొండంగిని కాపాడండి, జీవోలపై సెన్సార్ షిప్, క్రైమ్ రేట్ లో పెరుగుదల, స్టీల్ ప్లాంట్ ను కాపాడండి, టాయిలెట్లపై పన్ను, దళితులపై దాడులు, పర్యావరణ విధ్వంసాన్ని ఆపండి, ప్రెసిడెంట్ మెడల్ మద్యం బ్రాండ్లు, విద్యుత్ చార్జీల మోత, బెట్టింగులు వంటి అంశాలను తన ట్విట్టర్ వేదికగా స్నాప్ షాట్ లో చూపించే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాన్. తాజగా ఈ స్నాప్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
AP state Condition in a SnapShot. pic.twitter.com/ZBBBeAQtyX
— Pawan Kalyan (@PawanKalyan) September 23, 2021