ఏపీలో రాజకీయాలు వాడీ వేడిగా కొనసాగుతున్నాయి. అధికార- ప్రతిపక్ష నేతల మద్య మాటల యుద్దం నడుస్తూనే ఉంది. ఇక ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పార్టీ పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తన పదునైన మాటలతో విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ లో అప్పులు పెరిగిపోతున్నాయని.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్విట్టర్ వేధికగా సెటైర్లు పేల్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్విట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.
ఆంధ్రప్రదేశ్ లో అప్పులు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయని.. 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4.42 లక్షల కోట్ల వరకు ఉన్నట్లు కేంద్రం తెలిపింది. ఈ ఆర్ధిక సంవత్సరంలో గడిచిన తొమ్మిది నెలల కాలానికి ఏపీ గవర్నమెంట్ చేసిన అప్పు రూ.55,555 కోట్లకు చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎం జగన్‌పై ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ వ్యంగ్యంగా స్పందించారు. అంతే కాదు ఏపీ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం మాత్రమే కాదు.. అప్పులు కూడా ఎక్కువగా చేస్తోందంటూ ఓ కార్టూన్‌తో ట్వీట్ చేశారు.
ఈ సందర్భంగా ‘అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు, ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు. అలాగే కొనసాగించండి.. మీ వ్యక్తిగత సంపదను పెంచుకోవడం మర్చిపోవద్దు. రాష్ట్ర అభివృద్ది, సంపదను కుక్కలకు వదిలేయండి.. భారత రత్న లాగే మీకు ‘అప్పురత్న’ అవార్డు ఇవ్వాలి ’ అంటూ కార్టూన్‌లో ఏపీ సీఎం జగన్ పై సెటైర్లు పేల్చారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఈ ట్విట్ పై జనసేన, వైసీపీ కార్యకర్తల మద్య వార్ మొదలైంది. ఓ వైపు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని జనసేన కార్యకర్తలు అంటుంటే.. అప్పుల విషయంలో సీఎం ని అప్రదిష్టపాలు చేసి అబద్దాలను ప్రచారం చేస్తున్నారంటూ వైసీపీ కౌంటర్ ఇస్తోంది.
అప్పులతో ‘ఆంధ్ర’ పేరు మారుమోగిస్తున్నందుకు,ముఖ్యమంత్రి కి నా ప్రత్యేక శుభకాంక్షలు ..keep it up👍
P.S : Don’t forget to increase your personal wealth.Let the State wealth & progress go to ‘Dogs’ but your personal wealth & assets..‘ NEVER.’That’s the spirit CM✊#AppuRatnaAPCM pic.twitter.com/bnZEOHdMFa— Pawan Kalyan (@PawanKalyan) February 7, 2023