పవర్ స్టార్, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అంటే ప్రాణాలు ఇచ్చే అభిమానులు బోలేడు మంది ఉన్నారు. పవన్ పేరు వినపడితే చాలు పూనకాలు లోడింగ్ అంటూ ఊగిపోతారు. సినిమాలతో సంబంధం లేకుండా.. వ్యక్తిగతంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు పవన్ కళ్యాణ్. ఇక ప్రస్తుతం జనసేనాని రాజకీయాల్లో కూడా దూకుడుగా ముందుకు వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు మరో ఏడాది మాత్రమే ఉండటంతో.. దూకుడు పెంచారు పవన్. ఇప్పటికే అధికార పార్టీపై.. తనను విమర్శించే వారిపై తీవ్ర స్థాయిలో మండి పడుతూ.. ఘాటుగా విమర్శలు చేస్తున్నారు పవన్ కళ్యాణ్.
ఇక వచ్చే ఎన్నికల్లో పవన్ సీఎం కావాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. దాని కోసం కొందరు వినూత్న ప్రయోగాలు కూడా చేపడుతున్నారు. ఈ క్రమంలో ఓ జనసైనికుడి ప్రయత్నం చూసి పవన్ ఆశ్చర్యపోయారు. ప్రత్యేకంగా పిలిపించుకుని ప్రశంసించారు. ఆ విరాలు.. బాలాజీ అనే జనసేన పార్టీ కార్యకర్త ‘పల్నాడు ప్రజాసమస్యల పెట్టె’ పేరుతో.. పల్నాడు ప్రాంతంలో ఊరూరూ తిరుగుతూ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి వాటిని పవన్ కళ్యాణ్‌కు అందేలా కార్యక్రమాన్ని చేస్తున్నారు.
తాజాగా బాలాజీ ప్రయత్నం గురించి పవన్ కళ్యాణ్‌కు తెలిసింది. దాంతో ఆయన బాలాజీని జనసేన కార్యాలయానికి పిలిపించి మాట్లాడారు. అంతేకాక బాలాజీ ఆలోచనను మెచ్చుకున్న జనసేనాని.. అతడికి సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇచ్చి ప్రశంసించారు. బాలాజీ ప్రయత్నాన్ని అభినందిస్తూ.. అతడికి కొంత మొత్తం నగదు.. మొబైల్ బహూకరించారు పవన్ కళ్యాణ్. పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకునేందుకు జనసేన పార్టీ కార్యకర్త బాలాజీ ప్రత్యేకంగా ఇలాంటి ఒక కార్యక్రమం చేపట్టడం అభినందనీయం అన్నారు.
ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. ‘‘పల్నాడు ప్రాంత సమస్యలు తెలుసుకోవడానికి పవన్ కళ్యాణ్ చేపట్టి జనవాణి స్ఫూర్తితో నేను ఈ కార్యక్రమం ప్రారంభించాను. ఆ ప్రాతం ప్రజల సమస్యలను పవన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ‘పల్నాడు ప్రజాసమస్యల పెట్టె’ కార్యక్రమాన్ని ప్రారంభించానని’’ తెలిపాడు. ఇక రాబోయే రోజుల్లో కూడా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తానని.. తమ ప్రాంతంలోని ప్రజా సమస్యలను జనసేన అధినేత పవన్ దృష్టికి తీసుకెళతానని తెలిపారు. బాలాజీకి పవన్ సాయం చేయడంపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజనులు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
జనసైనికుని వినూత్న ప్రయత్నం… జనసేనాని అభినందన
Link: https://t.co/LssiQjY5Zk pic.twitter.com/M11qnKQjr8
— JanaSena Party (@JanaSenaParty) January 30, 2023