గత కొన్ని రోజులుగా ఏపీలో రాజకీయాలు మహా రసవత్తరంగా సాగుతున్నాయి. ఏ చిన్న ఛాన్స్ దొరికినా అధికార పార్టీపై ప్రతిపక్షాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఇక జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాన్ అధికార పార్టీపై ఏ రేంజ్ లో విరుచుకుపడున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఇదిలా ఉంటే ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పట్నం టూర్ హాట్ టాపిక్ గా మారింది. అయితే ప్రధాని పర్యటన రాజకీయంగా తమకు అనుకూలంగా మార్చుకనేందుకు బీజేపీ యత్నిస్తుందని వార్తలు వస్తున్నాయి. రాత్రి హూటల్ ఐఎన్ఎస్ చోళలో నరేంద్ర మోదీ బస చేయనున్నట్లు సమాచారం.
ఇదిలా ఉంటే.. ఆంధ్రప్రదేశ్ లో పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాన్ భేటీ కానుండటంపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాన్ ప్రత్యేక విమానంలో విశాఖపట్నం బయలుదేరారు. శుక్రవారం రాత్రి 8.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా భేటీ కానున్నారు. దాదాపు మూడేళ్ల తర్వాత ప్రధాని మోదీతో పవన్ భేటీ కానుండటంతో రాజకీయంగా ఏం జరగబోతుందని చర్చలకు దారి తీసింది.
ఇటీవల ఏపీ రాజకీయాల్లో రోడ్ మ్యాప్ కోసం బీజేపీ అధిష్టానం నుంచి ఎదురు చూస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో రోడ్ మ్యాప్ అంశం ప్రస్తావనలోకి వస్తుందని ప్రచారంలో ఉంది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపై చర్చ కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు. ఇటీవల బీజేపీ పై కూడా పవన్ పలుమార్లు మాటల యుద్దానికి దిగిన విషయం తెలిసిందే. మరీ ఈ భేటీలో ప్రధాని మోదీ, పవన్ మద్య ఎలాంటి రాజకీయ చర్చలు సాగుతాయన్న విషయంపై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి నెలకొంది.