ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయాలు నిత్యం హాట్ హాట్ గా ఉంటున్నాయి. అధికార వైసీపీ, ప్రతిపక్షా టీడీపీ ల మధ్య మాటల యుద్ధం సాగుతుంది. ఇదే సమయంలో జనసేన సైతం అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో మాటల యుద్ధానికి దిగుతుంది. ఇలా పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న సమయంలోనే పొత్తుల వ్యవహరంపై అనేక వార్తలు వినిపిస్తోన్నాయి. ముఖ్యంగా టీడీపీ, జనసేన కలసి రాబోయే ఎన్నికల్లో పోటీచేస్తాయని, అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అలానే జనసేన పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోనుందనే దానిపై నిత్యం అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఎవరు ఎన్ని మాట్లాడిన అధికారిక ప్రకటన వచ్చే వరకు ఎవరం ఏమి చెప్పలేము. ఇలాంటి తరుణంలో కొండగట్టు అంజన్న సాక్షిగా 2024లో జరగనున్న ఎన్నికల్లో పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారీటి ఇచ్చారు. మీడియాతో మాట్లాడిన పవన్ పొత్తుల విషయంలో మూడు ఆప్షన్స్ చెప్పారు. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
మంగళవారం జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెళ్లారు. ఇక ఆలయ ప్రాంగణంలో తన ఎన్నికల రథమైన వారాహికి ప్రత్యేక పూజలు చేశారు. పవన్ కల్యాణ్ కు ఆలయ అధికారులు, వేద పండితులు ఘన స్వాగతం పలికారు. సుమారు 11 గంటల సమయంలో కొండగట్టు చేరుకున్న పవన్ కల్యాణ్.. ముందుగా అంజన్నను దర్శించుకున్నారు. అనంతరం అక్కడ పవన్ కల్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య శాస్త్రోక్తంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు జరిపారు. ప్రత్యేకంగా ఆంజనేయ స్వామి యంత్రాన్ని వారాహి వాహనానికి కట్టి, శ్రీరామదూత్ అని సింధూరంతో రాశారు. ప్రత్యేక పూజల చేసిన అనంతరం వారాహిని ప్రారంభించారు.
కొండగట్టులో ప్రచార రథం వారాహికి పూజలు నిర్వహించిన అనంతరం పవన్ పొత్తులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తమ పార్టీ ఎలా ముందుకు వెళ్లనుందనే విషయాపై క్లారిటీ ఇచ్చారు. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే.. రాబోయే ఎన్నికల్లో పొత్తులపై ఫుల్ క్లారిటీగా ఉన్నట్లు తెలుస్తోంది. పొత్తులకు సంబంధించిన విషయాల గురించి పవన్ కల్యాణ్ మీడియాతో మాట్లాడారు. పొత్తులపై మూడు ఆప్షన్స్ పవన్ చెప్పారు. మొదటి ఆప్షన్ గా.. ఇప్పటి వరకు బీజేపీతోనే ఉన్నాము, భవిష్యత్ లో ఉంటామని ఆయన అన్నారు. ఇక రెండో ఆప్షన్ గా ఒకవేళ బీజేపీ తమను కాదంటే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తామని స్పష్టం చేశారు.
అదేదీ కుదరకపోతే కొత్త పొత్తులకూ సిద్ధమని మూడో ఆఫ్షన్ గా జనసేన అధినేత పవన్ పవన్ ప్రకటించారు. అయితే, ఈ మూడు ఆప్షన్స్ లో దేనిని ఎంచుకుంటామనేది ఎన్నికలకు వారం ముందు తెలుస్తుందన్నారు. అలానే ఏ పార్టీతో పొత్తు, ఏ పార్టీతో కలిసి వెళ్తామనేది ఎన్నికలకు వారం రోజుల ముందు స్పష్టత వస్తుందని పవన్ కల్యాణ్ తెలిపారు. పవన్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం అందరిలో ఆసక్తి పెంచాయి. మరి.. పొత్తుల విషయంలో పవన్ కల్యాణ్ చేసిన ఈ మూడు ఆఫ్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.