‘విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు’ నినాదంతో విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఉక్కు ఉద్యమానికి జనసేన మద్దతు తెలిపింది. అందులో భాగంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం పోరాడుతున్న వారికి పవన్ సంఘీభావం తెలిపారు. ప్రసంగానికి ముందు పవన్ కల్యాణ్ శ్రీశ్రీ రాసిన ‘నేను సైతం’ కవితను చదివి వినిపించారు. అంతేకాకుండా నాయకుడు, కవి ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలవాలని వ్యాఖ్యానించారు. ఉక్కు పరిశ్రమ కోసం చేసిన పోరాటాలను, పోయిన ప్రాణాలు, చేసిన త్యాగాలను మరోసారి పవన్ సభాముఖంగా గుర్తుచేసుకున్నారు.
ఏపీలో మద్యపానం నిషేదం గురించి పవన్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘నేను అన్ని జిల్లాలు తిరుగుతున్న సమయంలో చాలా మంది ఆడపడుచులు మద్యం అమ్మకాలు నిషేదించాలని కోరారు. అప్పుడు మా మేనిఫెస్టోలో.. అత్యధికంగా ఎక్కడైనా ఆడపడుచులు కోరుకుంటే అక్కడ మద్యం అమ్మకాలు నిషేదిస్తామని పెట్టాం. కానీ, జగన్ ఏకంగా సంపూర్ణ మద్యపాన నిషేదం అని నినాదాలు ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక బూంబూం బీర్లు, ప్రెసిడెంట్ మెడల్ అంటూ ఏవేవో బ్రాండ్లను తీసుకొచ్చారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మద్యం రేట్లు పెంచేశారు’ అంటూ పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై మద్యపాన నిషేధం అంశంపై సెటైర్లు వేశారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడాన్ని సమర్థిస్తారా? మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.