ఏపీ కేబినెట్‌లో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌పై పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ నిప్పులు చెరుగుతున్నారు. సోషల్ మీడియా వేదికగా మంత్రిని ట్రోల్ చేస్తున్నారు. అసలు జన సైనికులు గుడివాడ అమర్నాథ్‌ను ట్రోల్ చేయడం ఏంటి.. ఏం జరిగింది అంటే..
ఆదివారం విశాఖలోని పార్టీ కార్యాలయానికి వచ్చారు గుడివాడ అమర్నాథ్. ఈ సందర్భంగా గుడివాడ మాట్లాడుతూ.. ‘‘జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ముగ్గురు పెళ్లాల ముద్దుల మొగుడు. వ్యక్తిగత జీవితంలోనే కాదు.. రాజీకీయ జీవితంలో కూడా విలువలు లేని వ్యక్తి. అలాంటి వ్యక్తి రాష్ట్రంలో రైతు సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా పని చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదంగా ఉంది’’ అని మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు.
ఇది కూడా చదవండి: చంచల్ గూడలో షటిల్ ఆడుకున్న మీరా నాకు చెప్పేది: పవన్ కళ్యాణ్!
‘పవన్ కల్యాణ్ ఎలాంటి వాడు, ఆయన ప్రవర్తన ఎలా ఉంటుంది? అనేది మేం చెప్పడంకంటే ఆయన రెండో మాజీ భార్య రేణు దేశాయ్‌ని అడిగితే తెలుస్తుంది. రైతుల గురించి మాట్లాడే హక్కు పవన్ కల్యాణ్‌కు లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో అర్థంలేని విమర్శలు చేస్తున్నారు. పవన్ కల్యాణ్‌కు నిలకడ లేదు. ప్రతి ఎన్నికల్లోనూ ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని, తర్వాత కారణం లేకుండానే వెళ్లిపోతుంటారు’’ అని విమర్శించారు.
ఇది కూడా చదవండి: భర్తను చంపిన హంతకుడితోనే వియ్యం అందుకున్న మహిళ! అలా ఎందుకు చేశారంటే.
అంతేకాక ‘‘‘జగన్ పాలన జనరంజకంగా ఉంటే నేను రాజకీయాలు వదిలేసి సినిమాలు చేసుకుంటాను’ అని గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చెప్పారు. ఇప్పుడు జగన్ పాలన అద్భుతంగా ఉందని ప్రజలు చెబుతున్నందున ఆయన సినిమాలు చేసుకోవాలి. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కోసమే జనసేన పార్టీని ప్రారంభించారు. చంద్రబాబు స్క్రిప్ట్ ప్రకారమే పవన్ కల్యాణ్ నడుచుకుంటున్నారు. జగన్ వైసీపీని స్థాపించిన తర్వాతే కాంగ్రెస్ పార్టీ సీబీఐతో కేసులు పెట్టించింది. ఆ తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయిందనే విషయాన్ని టీడీపీ, జనసేన సహా ప్రతిపక్షాలన్నీ గుర్తుపెట్టుకోవాలి’’ అంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దాంతో పవన్ కల్యాణ్ అభిమానులు ఆయనను ఓ రేంజ్‌లో ట్రోల్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: 28 ఏళ్ల జైలుశిక్ష అనుభవించాక నిర్దోషిగా తేల్చిన కోర్టు.. ఇప్పుడతని పరిస్థితి ఏంటి!