పవర్ స్టార్ పవన్ కల్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సిసినిమాలతో సంబంధం లేకుండా.. ఆయనకు అభిమానులు ఉన్నారు. ఓ వైపు హీరోగా రాణిస్తున్న.. మరో వైపు రాజకీయాల్లో ప్రవేశించారు పవన్ కల్యాణ్. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. ప్రజల పక్షాన నిలుస్తారు. అవసరమైతే.. ఆర్థిక సాయం చేయడానికి కూడా వెనకాడారు. తాజాగా మరో సారి తన మంచి మనసు చాటుకున్నారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. కౌలు రైతులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: పవన్ కళ్యాణ్ సంచలన నిర్ణయం.. ఆ కుటుంబాలకు రూ. లక్ష సాయం..
భీమ్లా నాయక్ సినిమా ద్వారా వచ్చిన రూ. 5 కోట్లను జనసేన పార్టీకి విరాళం ఇస్తున్నట్లు ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ డబ్బుతో కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేస్తామని వెల్లడించారు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ధ్యాసంతా జనాల నుంచి డబ్బులు వసూలు చేయడంపైనే ఉందని.. వారిని ఆదుకోవడంలో లేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. వైసీపీ పాలనలో రైతుల ఆత్మహత్యలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు.
ఇది కూడా చదవండి: జనసేనలోకి మెగాస్టార్.. అభిమాని పోస్టుపై బండ్ల గణేష్ ట్వీట్..!
ఒక్క కర్నూలు జిల్లాలోనే 353 మంది కౌలు రైతులు చనిపోయారని.. అనంతపురంలో 170, ఉభయ గోదావరి జిల్లాల్లో 81 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాష్ట్రంలో ఇన్ని వేల మంది రైతులు ఉన్నారు.. వారికి ఎలా సాయం చేస్తారని తనను అడిగారని.. మనసుండి కదిలించగలిగితే సాయం చేయవచ్చని పేర్కొన్నారు. అందుకే ఈ మధ్య కాలంలో తనకు భీమ్లానాయక్ ద్వారా వచ్చిన డబ్బులో రూ. 5 కోట్లు తీసుకొచ్చానని.. ఈ డబ్బును రైతులను ఆదుకోవడానికి వినియోగిస్తానని తెలిపారు. అన్నం తినే ప్రతి ఒక్కరూ రైతు కష్టం గురించి ఆలోచించాలని పవన్ కళ్యాణ్ కోరారు. ఈ నెల 12వ తేదీ అనంతపురం నుంచి ఈ కార్యక్రమం ప్రారంభిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. కౌలు రైతులకు సాయం చేసే కార్యక్రమానికి ‘జనసేన రైతు భరోసా యాత్ర’గా నామకరణం చేసినట్లు ప్రకటించారు. పవన్ కల్యాణ్ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.