పవన్ కల్యాణ్ కు అభిమానులు కాదు.. భక్తులు ఉన్నారని చెప్పచ్చు. అటు హీరోగానే కాకుండా ఇటు రాజకీయ నాయకుడిగా కూడా పవన్ ఎంతో బిజీగా ఉంటున్నారు. పదేళ్ల కాలంగా పేదల తరఫున పోరాడుతున్నారు. తాజాగా మరోసారి పవన్ కల్యాణ్ భారీ విరాళం ఇచ్చి తన మంచి మనసు చాటుకున్నారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు నటుడిగానే కాకుండా వ్యక్తిత్వం పరంగానూ ఎంతో మంది అభిమానులు ఉన్నారు. తన నటనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో కోట్లలో అభిమానులను సొంతం చేసుకున్నారు. అదే విధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రజల్లో అభిమాను, ఆదరణ మరింత పెరిగాయి. పేదల కోసం ఆయన పోరాడుతున్న తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పవన్ కల్యాణ్ ఎంతో మంది పేదకు అనేక సార్లు ఆర్థిక సాయం చేయడం చూశాం. అందుకే పవన్ పేద ప్రజల దృష్టిలో మంచితనానికి మారుపేరుగా నిలిచిపోయారు. సినీ నటుడిగానే కాదు.. రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కూడా సేవా కార్యక్రమాలను కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. రంజాన్ మాసం ముస్లింలకు లక్షల రూపాయలు విరాళంగా ఇచ్చి పవన్ కల్యాణ్ మరోసారి తన మంచి మనుసుని చాటుకున్నారు.
పవన్ కల్యాణ్ పేరు వినగానే అందరికీ సినిమాల కంటే.. సేవా కార్యక్రమాలే ఎక్కువగా గుర్తొస్తాయి. ఎందుకంటే పవన్ కల్యాణ్ కోట్ల రూపాయలను విరాళం ఇచ్చారు.. ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు ముస్లింలకు పవన్ కల్యాణ్ బూరి విరాళం అందజేశారు. రంజాన్ మాసం సందర్భంగా ఇస్లాం ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ కు రూ.25 లక్షలు విరాళంగా అందజేసి గొప్ప మనసు చాటుకున్నారు. విజయవాడకు చెందిన దారుల్ ఉలుమ్ హలేమియావెల్ ఫేర్ సొసైటీకి రూ.5 లక్షలు అందజేశారు. అమరావతిలోని జామియా అతీఖుర్ రహమాన్ లిల్ బనాత్ ఎడ్యుకేషన్ సొసైటీకి, మంగళగిరిలోని మసీద్ ఎ నూర్ కు, కర్నూలు దర్గాకు, కడప మసీదుకు తలో రూ.5 లక్షల చొప్పున పవన్ కల్యాణ్ విరాళం అందజేశారు.
ఇస్లాం విద్య, ధార్మిక సంస్థలు ప్రార్థన స్థలాలకు విరాళాలు అందించిన శ్రీ @PawanKalyan గారు pic.twitter.com/GnT5Ytm5ge
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023
విజయవాడ, అమరావతి, మంగళగిరి ప్రాంతాలకు చెందిన పలువులు ముస్లింలు ఉపవాస దీక్ష ముగిసిన తర్వాత హైదరాబాద్ లో పవన్ కల్యాణ్ ని కలిశారు. వారికి పండ్లు, పానియాలు అందజేసి ఉపవాస దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “ఏ మతం, కులంలో పుట్టాలనే ఛాయిస్ మన చేతుల్లో లేదు. ఏ మతం, కులంలో పుట్టినా మానవత్వంతో జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. భగవంతుడి దృష్టిలో మనమందరం సమానమే. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కుల, మతాలకు అతీతంగా పేదరికం పారదోలడం మీద దృష్టిపెడతాం. ముస్లిం నివాస ప్రాంతాల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు జనసేన ప్రాధాన్యం ఇస్తుంది. వ్యక్తులు చేసే తప్పుల్ని కులానికో, మతానికో అంటగట్టడం సరైంది కాదు” అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.
శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “ఏ మతం, కులంలో పుట్టాలనే ఛాయిస్ మన చేతుల్లో లేదు. ఏ మతం, కులంలో పుట్టినా మానవత్వంతో జీవించడం మాత్రం మన చేతుల్లోనే ఉంది. భగవంతుడు దృష్టిలో మనందరం సమానమే. జనసేన పార్టీ అధికారంలోకి వస్తే కుల, మతాలకు అతీతంగా పేదరికం పారదోలడం మీద దృష్టిపెడతాము. pic.twitter.com/2ij6Yy61YQ
— JanaSena Party (@JanaSenaParty) April 16, 2023