టాలీవుడ్ లో మెగాఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో పవన్ కళ్యాన్. స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉండగానే ప్రజలకు ప్రత్యక్ష సేవలు అందించేందుకు ఆయన 2014లో జనసేన పార్టీని స్థాపించి.. ప్రజల తరుపు నుంచి ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోల్లో పవన్ కళ్యాణ్ ఒకరు. అభిమానులు ‘పవర్ స్టార్’గా పిలుచుకుంటారు. హీరోగా మంచి సక్సెస్ తో సాగుతున్న సమయంలో 2014 మార్చిలో ‘జనసేన’ పార్టీ స్థాపించాడు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. రాజకీయాల్లో బిజీగా ఉంటున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. పవన్ కల్యాణ్ తిరుపతి పర్యటనలో ఓ అరుదైర ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
శ్రీకాళహస్తిలో జనసేన నాయకుడు కొట్టే సాయి ధర్నా చేస్తున్న సమయంలో సీఐ అంజూ యాదవ్ అతనిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. ఈ నేపథ్యంలోనే తిరుపతికి వచ్చి సీఐ పై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి రేణిగుంటకు చేరుకొని అక్కడ నుంచి జనసేన కార్యకర్తలతో భారీ ర్యాలీగా జిల్లా ఎస్పీ ఆఫీస్ కి చేరుకున్నారు. పవన్ కళ్యాణ్ ర్యాలీలో ఓ విచిత్ర దృశ్యం చోటుచేసుకుంది. ఓ అభిమాని క్రేన్ పై గాలిలో తెలుతూ వచ్చి పవన్ కళ్యాణ్ కి శాలువా కప్పి, మెడలో దండ వేశారు. ఆ అభిమాని చేసిన ఫీట్ ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది. పవన్ కళ్యాణ్ కోసం ఇంత సాహసం చేసి అభిమానం చాటుకున్న ఆ అభిమానిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్లు పెడుతున్నారు.
ఇదిలా ఉంటే.. శ్రీకాళహస్తిలో జనసైనికులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే సీఐ అంజూ యాదవ్ తమ నాయకుడైన కొట్టే సాయిపై కావాలని చేయిచేసుకున్నారని పవన్ ఆరోపించారు. జనసైనికులు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారని పవన్ అన్నారు. ఈ నేపథ్యంలోనే సీఐ అంజూ యాదవ్ పై చర్యలు తీసుకోవాలని తిరుపతి చేరుకొని జిల్లా ఎస్పీని కలిశారు. జనసేన నాయకులతో కలిసి ఎస్పీ కి వినతిపత్రం అందజేశారు. మొత్తానికి పవన్ కళ్యాణ్ ర్యాలీలో అభిమాని చేసిన హాడావుడి అంతా పక్కాగా జరిగింది.. క్రేన్ వ్యవహారంలో ఏమాత్రం తేడా వచ్చినా పెద్ద ప్రమాదమే జరిగి ఉండేదని అంటున్నారు అభిమానులు.. జనసైనికులు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాడు ఆ వీరాభిమాని.