జనసేన అధినేత పవన్‌కల్యాణ్ గుంటూరు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ఆయన కాన్వాయ్ మంగళగిరి డీజీపీ కార్యాలయం వద్దకు రాగానే కాన్వాయ్‌లోని రెండు కార్లు ఢీకొన్నాయి. ప్రమాద సమయంలో ఎయిర్‌బ్యాగ్స్ ఓపెన్ కావడంతో పెనుప్రమాదం తప్పింది. కాగా ప్రమాదంలో పవన కళ్యాణ్ కు ఎలాంటి హాని జరగలేదు.