తెలుగు ఇండస్ట్రీలో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు పవన్ కళ్యాన్. మొదటి నుంచి ప్రజా సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఉన్న పవన్ కళ్యాణ్.. నటన కేవలం ఎంటర్ టైన్ మాత్రమే ఇస్తుంది.. ప్రజా సేవకు అవకాశం ఇవ్వదని భావించి 2014 మార్చి 14 న ‘జనసేన’ పార్టీ స్థాపించారు. అప్పటి నుంచి ప్రజల కోసం పోరాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు.
నటుడిగా వెండితెరపై అలరించిన పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రజలకు సేవ చేయాలి.. వారి కష్టాలు కొంతమేరకైనా తీర్చాలన్న తపనతో ఉండేవారు. అయితే నటుడిగా కన్నా రాజకీయ నాయకుడిగా ప్రజలకు మరింత చేరువ కావాలన్న ఉద్దేశ్యంతో 2014 మార్చి 14న ‘జనసేన’ పార్టీ స్థాపించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. 2019 ఎన్నికల్లో ఓటమి పొందినా.. ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం పోరాడుతూ.. అధికార పార్టీనీ ప్రశ్నిస్తూ ముందుకు సాగుతున్నారు పవన్ కళ్యాణ్. పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాన్ కి అన్ని విషయాల్లో వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఆయన సోదరుడు నాగబాబు. తాజాగా జనసేన పార్టీలో నాగబాబుకి కీలక పదవి అప్పగించారు పవన్ కళ్యాణ్. వివరాల్లోకి వెళితే..
జనసేన పార్టీలో ముందు నుంచి కీలక వ్యక్తిగా కొనసాగుతూ వస్తున్నారు కొణిదెల నాగబాబు. తాజాగా నాగబాబుని జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నియామక పత్రాన్ని అందజేశారు. శుక్రవారం ఏప్రిల్ 14, జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో నాగబాబుకు పవన్ కళ్యాన్ స్వయంగా బ్యాడ్జీ తొడిగారు. ప్రస్తుతం నాగాబాబు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులుగా కొనసాగుతున్నారు. విదేశాలలో ఉన్న పార్టీ ప్రతినిధులు, అభిమానులను నాగబాబు సమన్వయపరుస్తారు. ఆయన సేవలు మరింత విసృతం చేయాలనే ఉద్దేశంతో పార్టీకి ఉపయోగపడే విధంగా కీలక బాధ్యతలు అప్పగించడంపై జనసేన కర్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు నెల్లూరుకి చెందిన ఉన్నత విద్యావంతుడైన వేములపాటి అజయ్ కుమార్ ను జాతీయ మీడియా ప్రతినిధిగా పవన్ కళ్యాన్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, గత కొంత కాలంగా అజయ్ కుమార్ జనసేన పార్టీకి పరోక్షంగా పలు సేవలు అందిస్తూ వస్తున్నారు. జనసేన పార్టీని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నారు. ఆయన సేవలు గుర్తించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కీలక బాధ్యతలు అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి జాతీయ మీడియాకు జనసేన పార్టీ తరుపు నుంచి అధికార ప్రతినిధిగా అజయ్ కుమార్ సేవలు అందించడంతో పాటు రాజకీయ శిక్షణ తరగులు, బూత్ స్థాయి పర్యవేక్షణ, పార్టీ అంతర్గత క్రమశిక్షణ లాంటి పలు బాధ్యతలను నిర్వహించనున్నారు.
జనసేన ప్రధాన కార్యదర్శిగా శ్రీ @NagaBabuOffl
జాతీయ మీడియాకు పార్టీ తరపున అధికార ప్రతినిధిగా శ్రీ వేములపాటి అజయ కుమార్ గారు pic.twitter.com/Vi2J6rjyB6
— JanaSena Party (@JanaSenaParty) April 14, 2023