ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ప్రముఖ రాజకీయ నేతలు ఇప్పటికే కరోనా బారిన పడ్డారు. తాజాగా టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆయన హోం ఐసోలేషన్‌లోనే చికిత్స పొందుతున్నారు. ఆయన స్వల్ప కరోనా లక్షణాలతో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం. కాగా గత కొన్ని రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని, కరోనా జాగ్రత్తలు పాటించాలని శ్రీరామ్ సూచించారు. కాగా ఇప్పటికే టీడీపీ నేత వంగవీటి రాధ, పయ్యావుల కేశవ్, మంత్రి కొడాలి నాని కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. మరి ఇలా రాజకీయ నేతలు వరుసగా కరోనా బారిన పడ్డంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.