అబ్బాయి కోసం పూజలు, పుణస్కారాలు చేస్తుంటారు. తీరా పుట్టాక.. అల్లారు ముద్దుగా చూస్తూ.. అడిగిందల్లా కొనిస్తూ.. పెద్ద పెద్ద చదువులు చదివిస్తుంటారు. కానీ అతడికి పెళ్లి చేశాక అసలైన విశ్వ రూపం కనిపిస్తుంటోంది. ఆస్తి పంచాలని లేదంటే అనేక కారణాలతో తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాడు.
పున్నామ నరకం నుండి తప్పించేదీ పుత్రుడే కాబట్టి.. మగపిల్లవాడు పుట్టాలని ఆశపడుతుంటారు తల్లిదండ్రులు. వారసత్వంతో పాటు ఇంటి పేరును నిలబెట్టేదీ కొడుకేనన్న అపోహలో ఉండిపోయి.. అబ్బాయి కోసం పూజలు, పుణస్కారాలు చేస్తుంటారు. తీరా పుట్టాక.. అల్లారు ముద్దుగా చూస్తూ.. అడిగిందల్లా కొనిస్తూ.. పెద్ద పెద్ద చదువులు చదివిస్తుంటారు. కానీ అతడికి పెళ్లి చేశాక అసలైన విశ్వ రూపం కనిపిస్తుంటోంది. ఆస్తి పంచాలని, లేదంటే అత్తా, మామ, కోడలికి పడటం లేదని వారిని దూరంగా పెట్టడం వంటివి చేస్తారు. వారిని చూడటం ఇష్టంలేని కుమారుడు తల్లిదండ్రులకు ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తాడు. శ్రీకాకుళం జిల్లాలోని ఓ వృద్ధ దంపుతులకు కూడా ముగ్గురు కొడుకులు. కానీ పెద్ద కుమారుడి కారణంగా ఊరి నుండే బహిష్కరణకు గురయ్యారు.
శ్రీకాకుళం జిల్లాలోని ఇన్నేసుపేటలో ఉంటున్నారు చంద్రశేఖర్, సారాలమ్మ అనే దంపతులు. వీరికి ముగ్గురు కుమారులు. ముగ్గురికి పెళ్లిళ్లు చేసి, తలో ఇళ్లు కట్టించి ఇచ్చారు. వీరిలో పెద్ద కుమారుడి దామోదర్‌కు కాస్తంత ఎక్కువే ఆస్థి పంపకం చేశారు. అయితే వృద్ధాప్యం వచ్చే సరికి పెద్ద కుమారుడి దగ్గర ఉండటం మొదలు పెట్టారు. అప్పటి నుండి పెద్ద కుమారుడి వీరిని సూటి పోటీ మాటలతో హింసించడం మొదలు పెట్టాడు. ‘నా దగ్గర ఉంటారా.. మిగతా కొడుకుల వద్దకు పోరా’అంటూ సతాయిస్తూ.. ఓ రోజు ఇంట్లో నుండి గెంటేశాడు. అయితే కనీసం బతికేందుకు భత్యం ఇవ్వాలని కోరగా.. పెద్ద కుమారుడు ఇద్దరిపై చేయి చేసుకున్నాడు. కొడుకు వెళ్లగొట్టడంతో పాటు కొట్టాడంటూ దంపుతులిద్దరూ పోలీసులను ఆశ్రయించారు.
అంతే ఈ విషయం తెలిసిన పెద్ద కుమారుడు అగ్గిలం మీద గుగ్గిలం అయిపోయాడు. ఊర్లోని పెద్దలకు చెప్పాడు. ఊర్లో పెద్ద మనుషులకు చెప్పకుండా.. పంచాయతీ పెట్టించుకుండా పోలీస్ స్టేషన్‌కు వెళతారా అంటూ న్యాయం చేయాల్సిన పెద్ద మనుషులంతా వీరిని గ్రామం నుండి బహిష్కరించారు. వాళ్లతో మాట్లాడితే ఐదు వేల రూపాయల జరిమానా వేశారు. ఇక చిన్న కుమారుడు మోహన్ రావు తల్లిదండ్రుల దుస్థితి తెలిసి.. ఇంటికి తెచ్చి పెట్టుకుంటే..ఈ విషయంపై కూడా గ్రామ పెద్దలు మండిపడ్డారు. మాకు చెప్పకుండా పోలీస్ స్టేషన్‌కు వెళ్లడమే కాకుండా.. మీడియా దృష్టికి తీసుకెళ్లినందుకు చిన్న కుమారుడికి కూడా రూ. 11 వేల రూపాయలు జరిమానా వేశారు గ్రామ పెద్దలు.