తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకు తగినట్లే చాలా మంది పిల్లలు కష్టపడి చదువుకుని మంచి స్థాయిలో ఉంటారు. కానీ కొందరి విషయంలో మాత్రం విధి చిన్నచూపు చూస్తుంది. అలాంటి విషాద ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
తమ బిడ్డలు బాగా చదువుకుని ఉన్నత స్థితికి చేరాలని తల్లిదండ్రులు కలలు కంటారు. అందుకు తగినట్లే చాలా మంది పిల్లలు కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిర పడుతుంటారు. అయితే కొంతమంది పిల్లలు మాత్రం వారి కళ్లలో కన్నీళ్లు మిగిల్చి తిరిగిరాని లోకాలకు వెళ్తున్నారు. అచ్చం అలానే ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులు.. ఓ కుమారుడి మరణం కడుపుకోతను మిగిల్చింది. అయితే అందరిలా తమ బిడ్డను సమాది చేయకుండా సమాజానికి ఏదో ఒక రకంగా ఉపయోగపడాలని భావించారు. కొడుకు అవయవాలు దానం చేసి.. ఆ తల్లిదండ్రులు సమాజానికి ఆదర్శంగా నిలిచారు.ఈ ఘటన శ్రీకాకుళం జిల్లాలో చోటుచేసుకుంది.
శ్రీకాకుళం జిల్లా సోంపేటకు చెందిన కిరణ్ చంద్ పదో తరగతి చదవుతున్నాడు. ఇటీవలే పదో తరగతి పరీక్షలు రాస్తున్న కిరణ్ చంద్ అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడిని విశాఖపట్నంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించి.. చికిత్స చేయించారు. చాలా రోజుల పాటు వైద్యులు కిరణ్ చంద్ కి చికిత్స అందించారు. అయితే అతడి బ్రెయిన్ లో రక్తస్రావం కావడంతో కోమాలోకి వెళ్లాడు. ఇదే విషయాన్ని అక్కడి వైద్యులే అతడి తల్లిదండ్రులకు తెలిపారు. దీంతో శ్రీకాకుళం జిల్లా సోంపేట గ్రామీణ మండలం రాగోలులోని జెమ్స్ ఆసుపత్రిలో ఈ నెల 16 వ తేదీన చేర్పించారు. అనంతరం అతని పరిస్థితి విషమించడంతో.. బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధృవీకరించారు.
అనంతరం అవయవ దానం ప్రాముఖ్యత గురించి వైద్యులు మృతుడి తల్లిదండ్రులకు వివరించారు. దీంతో కిరణ్ చంద్ తల్లిదండ్రులు.. మోహన్ రావు, కళ్యాణి అవయవదానంకి అంగీకరించారు. కిరణ్ గుండె, మూత్రపిండాలు, కాలేయం, కళ్లను ఇతర ఆస్పత్రులకు పంపించేందుకు జెమ్స్ ఆసుపత్రి సిబ్బంది ఏర్పాటు చేశారు. గ్రీన్ చానల్ ద్వారా జెమ్స్ ఆసుపత్రి నుంచి తిరుపతి, విశాఖపట్నం, విజయనగరానికి అవయవాలు తరలించామని వైద్యులు తెలిపారు. కిరణ్ మరణించినప్పటీకీ తన అవయవదానాలతో ఇతరుల్లో సజీవంగా ఉంటారని వైద్యులు తెలిపారు. అలానే అవయవదానానికి ముందుకు వచ్చిన కిరణ్ తల్లిదండ్రులకు ఆస్పత్రి వైద్యులు కృతజ్ఞతలు తెలిపారు. మరి.. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.