నిత్యం ఎదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో 25 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్తా పడింది.
నిత్యం ఎదో ఒక ప్రాంతంలో రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అతివేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్, మద్యం తాగి వాహనం నడపడం వంటి ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల కారణంగా ఎందరో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. అలానే మరెందరో అంగవైకల్యం ఏర్పడి జీవితాన్ని నరక ప్రాయంగా గడుపుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్ కి చెందిన బస్సు జాతీయ రహదారిపై బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
ఏలూరు జిల్లా దెందులూరు సమీపంలో జాతీయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్ కు చెందిన బస్సు హైదరాబాద్ నుంచి విజయనగరం వెళ్తుంది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలోని దెందులూరు వద్దకు చేరుకునే సరికి ప్రమాద వశాత్తు ఆ బస్సు బోల్తా పడింది. ఈ బస్సులో 25 మంది ప్రయాణికులతో పాటు,ముగ్గురు డ్రైవర్లు కూడా ఉన్నారు. బస్సు బోల్తా పడటంతో అందులోని ప్రయాణికులు ఒక్కసారిగా కేకలు వేశారు. అటుగా వెళ్తున్న వాహనదారులు ప్రమాదాన్ని గుర్తించి.. స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే దెందులూరు ఎస్సై వీరరాజు, హైవే పెట్రోలింగ్ పోలీసులు, హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.
బస్సులో ఉండిపోయిన బాధితులను బయటకి తీసి ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారిని నాలుగు అంబులెన్సులలో ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో 11 మంది గాయపడ్డారు. అలానే ఈ ప్రమాదంపై దెందులూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు ఉంటున్నారు. మరి.. ఇలా నిత్యం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.