తిరుమల తిరుపతిలో అన్నదానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. చాలామంది ప్రముఖులు తమ, కుటుంబ సభ్యులు, సన్నిహితుల పుట్టినరోజు, పెళ్లి రోజు సందర్భంగా తిరుమలలో అన్నదానం చేపిస్తారు. ఈ క్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమలలో ఒక్కరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ నిత్యాన్నప్రసాద వితరణకు ఏటా దేవాన్ష్ పుట్టిన రోజు కానుకగా టీటీడీలో ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే రూ.30 లక్షల రూపాయల మొత్తాన్ని చంద్రబాబు కుటుంబం విరాళంగా ఇస్తోంది.
ఇది కూడా చదవండి: ఏపీ అసెంబ్లీ వేదికగా సరికొత్త సంస్కృతులు..
దీనిలో భాగంగానే ఈ ఏడాది కూడా చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా ఒక్కరోజు అన్నదాన వితరణకు అయ్యే 30 లక్షల రూపాయలను విరాళంగా అందజేశారు. ఈ ఏడాది విరాళంతో అన్నప్రసాదాలను వడ్డించాలని టీటీడీని చంద్రబాబు కుటుంబం కోరింది. దీంతో నేడు తరిగొండ వెంగమాంబ నిత్యాప్రసాద భవనంలో ‘టుడే డోనర్ మాస్టర్ నారా దేవాన్ష్’ అనే పేరుతో ఒక్కరోజు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: పవన్ టార్గెట్ చేసింది జగన్ ని కాదా? చంద్రబాబునా?
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.