పెళ్లిళ్లలో భోజనాల తర్వాత అత్యంత ప్రాధాన్యతనిచ్చే అంశం ఉండందటే అది ఫోటోలే. నిశ్చయ తాంబూలాల నుండి పెళ్లికి జరిగే ప్రతి తంతు ఫోటోల రూపంలో పొందు పర్చుకుంటాం. ఈ ఫోటోలే భవిష్యత్తులో మధురానూభూతులను, జ్ఞాపకాలను మిగులుస్తుంటాయి. ఇటీవల పెళ్లిల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ లదే హవా. వీటి కోసం భారీగా ప్రణాళికలు రూపొందించుకుంటున్నారు. అందమైన లోకేషన్లు, కాస్ట్యూమ్స్ పై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఈ ప్రీ వెడ్డింగ్ ఫోటో కోసం ప్రొఫెషనల్ పోటోగ్రాఫర్లను నియమించుకుంటున్నారు. అయితే ఇటీవల ఓ పెళ్లికి సంబంధించిన ఫ్రీ వెడ్డింగ్ ఫోటో షూట్ నవ్వులు తెప్పించడంతో పాటు వైరల్ గా మారింది.
ఉత్తరాంధ్రకు చెందిన ఓ పెళ్లి జంట తమ ఫ్రీ వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లారు. అక్కడ ఓ నాటు పడవలో స్టిల్స్ ఇచ్చేందుకు సిద్ధమౌతుండగా.. వారికో వింత అనుభవం ఎదురైంది. నాటు పడవ తోలే ఓ ముసలాయన వారికి సలహాలు ఇవ్వడం ప్రారంభించారు. అబ్బాయి వైపు తిరిగి నుంచోవాలని, చేయి మీదకెట్టు అంటూ, నాన్ సెప్పినట్లూ చేయి అంటూ ఫోటోగ్రాఫర్ల కన్నా ఆయనే వారిని డైరెక్ట్ చేస్తూ హడావుడి చేసేశాడు. అంతే కాదండోయ్ ఎలా నుంచావాలో కూడా ఆయనే చేసి చూపించాడు. ఉత్తరాది యాసలో మాట్లాడుతూ.. వధూవరులతో ఫోటో షూట్ చేయించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.
ఈ వీడియోపై ఫన్నీతో పాటు పాజిటివ్ కామెంట్లు వస్తున్నాయి. తాతయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. మరికొంత మంది నువ్వు సూపర్ తాత అంటుంటే.. టైం బాగోక పడవ దగ్గరే ఆగిపోయారు కానీ తాతకు అవకాశం ఇవ్వాలే కాని రొమాంటిక్ మూవీ తీశాలా ఉన్నారే అని, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ లా కనిపిస్తున్నాడని, ముసలోడే కానీ మామూలోడు కాదూ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ ఫన్నీ వీడియోను మీరూ చూసి.. మీకెమనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
K Raghavendra Rao got competition https://t.co/cTFpxs0iDu
— Nothing Exactly (@kalyan_frisco) January 23, 2023