కొందరి నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మరికొన్ని అధికారులు, స్థానికుల చర్యలతో తృటిలో తప్పిపోతుంటాయి. నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఎన్ని ఘోరాలు జరిగాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో, అతివేగంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటారు. తాజాగా విశాఖలో కూడా ఓ పెను ప్రమాదం తప్పింది. పెట్రోల్ ట్యాంకర్.. ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది.
కొందరి నిర్లక్ష్యం కారణంగా పెను ప్రమాదాలు సంభవిస్తుంటాయి. మరికొన్ని అధికారులు, స్థానికుల చర్యలతో తృటిలో తప్పిపోతుంటాయి. నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే ఎన్ని ఘోరాలు జరిగాయే మనకు తెలిసిందే. ముఖ్యంగా కొందరు డ్రైవర్లు మద్యం మత్తులో, అతివేగంతో రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటారు. ముఖ్యంగా ప్రమాదకరమైన సరకును తీసుకెళ్తున్న డ్రైవర్లు.. ఎంతో జాగ్రత్తగా ఉండాల్సింది పోయే.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. కొన్ని నెలల క్రితం పాకిస్థాన్ లో అతివేగంగా వెళ్తున్న పెట్రోల్ ట్యాంకర్ బోల్తా కొట్టింది. అనంతరం జరిగిన పేలుడులో దాదాపు 100 మంది మృతి చెందారు. తాజాగా అలాంటి పెను ప్రమాదమే విశాఖలో తప్పింది. పెట్రోల్ ట్యాంకర్.. ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది. దీంతో స్థానికులు చాలా సమయంలో భయాందోళనకు గురయ్యారు. ఇక స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సోమవారం విశాఖపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ కింద ఓ పెట్రోల్ ట్యాంకర్ మూడు గంటల పాటు ఇరుక్కుపోయింది. ఫ్లై ఓవర్ మీద నుంచి వెళ్లాల్సిన ఈ భారీ వాహనం.. దిగువ రోడ్డు మార్గంలో రావడంతో ఫుట్ ఓవర్ వంతెన వద్ద ఇరుక్కుపోయింది. పెట్రోల్ ట్యాంకర్ కావడంతో స్థానికంగా తీవ్ర టెన్షన్ వాతావరణం నెలకొంది. తమిళనాడుకు చెందిన పెట్రోల్ ట్యాంకర్.. శ్రీకాకుళం నుంచి రాజమండ్రికి వెళ్తుండగా విశాపట్నంలోని ఎన్ఏడీ జంక్షన్ వద్ద ఫుట్ ఓవర్ కింద ఇరుక్కుపోయింది.
అయితే ఇర్కుపోయిన ప్రాంతం నుంచి లారీని బయటకు తెచ్చేందుకు డ్రైవర్ ప్రయత్నించాడు. అయినా ఫలితం లేకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో రెండు భారీ క్రేన్‌లతో అధికారులు అక్కడికి చేరుకున్నారు. ఆ భారీ క్రేన్ల సాయంతో మూడు గంటల పాటు శ్రమించిన అనంతరం ఆ పెట్రోల్ ట్యాంకర్ ను బయటకు తీశారు. ట్యాంకర్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే ముందు ఉన్న ఫుట్ ఓవర్ ను గమనించకుండా పెట్రోల్ ట్యాంకర్ ను తీసుకెళ్లి ఇరిక్కించినట్లు స్థానికులు అంటున్నారు. లారీని బయటకు తీసిన ఈ మూడు గంటల సమయం పాటు ఇతర వాహనాలు ఫ్లై ఓవర్ మీద నుంచి రాకపోకలు సాగించాయి.
సోమవారం మధ్యాహ్నం నుంచి దిగువ రోడ్డు నుంచి రాకపోకలు సాగాయి. లారీ డ్రైవర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ కింది మార్గంలో భారీ వాహనాలు ప్రవేశించకుండా హైట్ గేజ్ స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నా.. ఆ దిశగా అధికారులు చర్యలు తీసుకోలేదని స్థానికులు అంటున్నారు. గతంలోనూ వివిధ ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. మరి.. ఇలాంటి ఘటనల్లో నిర్లక్ష్యం ఎవరిది అనే విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.