దేశ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆర్ఆర్ఆర్ సినిమా నామస్మరణే. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , ఎన్టీఆర్ కలిసి మల్టీ స్టారర్ గా తెరకెక్కిన ‘ఆర్ఆర్ఆర్’మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా ఇప్పటికే పలు ప్రాంతాల్లో బెనిఫిట్ షోలు ప్రదర్శించారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకూ ఎక్కడ చూసినా ఎవరి నోటా విన్నా ఆర్ఆర్ఆర్ సినిమా గురించి చర్చలు నడుస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ ఆడుతోన్న థియేటర్ల వద్ద అభిమానుల రచ్చ మామూలుగా లేదు. దేశ, విదేశాల్లో ఆ సినిమా ఆడుతోన్న థియేటర్ల ముందు నానా హంగామా చేస్తున్నారు.
దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ నామ స్మరణతో సినీ అభిమానులు పండుగ చేసుకుంటున్నారు. ఓ చిత్రకారుడు ఆర్ఆర్ఆర్ చిత్ర యూనిట్ కి వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పాడు. ముక్కుతోనే ముగ్గురి చిత్రాలు వేసి అదరహో అనిపించారు. నిజాంపేట్‌కు చెందిన సద్గురు ది స్కూల్ అఫ్ ఆర్ట్స్ వ్యవస్థాపకులు… ప్రముఖ నాసికా చిత్రకారుడు సత్యవోలు రాంబాబు.. ముక్కుతో డైరెక్టర్ రాజమౌళితో పాటు హీరోలు జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ చిత్రాలను చిత్రించి యూనిట్‌కి శుభాకాంక్షలు తెలియజేశారు.
తమ నటనా ప్రతిభతో కోట్లాది ప్రేక్షకులను పొందిన జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్‌ను అభినందించారు. అంతర్జాతీయంగా ఈ సినిమా విజయవంతం కావాలని… కష్టతరమైన ఇష్టంగా ఈ చిత్రాన్ని చిత్రించినట్లు రాంబాబు తెలిపారు. రాంబాబు వేసిన చిత్రాలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.