రాజకీయం అంటే ఈరోజుల్లో చాలా డబ్బుతో కూడుకున్న పని. ఏదైనా నామినేట్ పదవుల కోసం కూడా కోటీశ్వరులు పోటీ పడుతుంటారు. ఇలాంటి పరిస్థితిల్లో ఒక పేదోడికి పదవి ఎలా దక్కుతుంది? దాదాపు అసాధ్యం అనే చెప్పుకోవాలి. దాదాపు మొత్తం దేశ రాజకీయాల్లో ఇలాంటి పరిస్థితిలే నెలకొని ఉన్నాయి. కానీ.., ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ విషయంలో తన మంచి మనసుని చాటుకున్నారు. పేదోళ్ళకి న్యాయం జరగాలంటే.., వారికి అండగా మరో పేదోడే నాయకుడిగా ఉండాలని బలంగా నమ్మారు. ఇందుకోసం సీఎం కాకముందే ఓ మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ మాటని నిలబెట్టుకుని విశ్వనీయత ఉన్న నాయకుడిగా జగన్ తనని తాను మరోసారి నిరూపించుకున్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా సంచార జాతుల వారికి సరైన గుర్తింపు ఉండదు. వీరికి సరిగ్గా ఓటర్ కార్డు కూడా ఉండదు. దీంతో.., ప్రభుత్వాలు వీరి జీవన స్థితిగతులను పెద్దగా పట్టించుకోవు. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి సంచార జాతుల వారు ఎక్కువ ఉన్నారు. వీరు మందుల కులం కిందకి వస్తారు. అంటే బీసీ-ఏ అనమాట. కానీ.., వీరి ఆర్థిక స్థితిగతులు చాలా దారుణంగా ఉంటాయి. దీనితో తమ కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చాలనే పోరాటానికి నాయకత్వం వహించారు పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గంకి చెందిన పెండ్ర వీరన్న. కానీ.., అప్పటి అధికార పక్షం వీరి గోడుని పట్టించుకోలేదు. దీంతో.., అప్పట్లోనే పెండ్ర వీరన్న సీఎం జగన్ ని పాదయాత్రలో కలిశారు. తమ డిమాండ్స్ వినిపించాడు.
కులాలకి రిజర్వేషన్స్ కల్పించే అంశం రాష్ట్రాల పరిధిలో ఉండేది కాదు. కానీ.., మన ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే సంచార జాతుల వారికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి.., వారు అన్నీ విధాలా నిలదొక్కుకూనేలా చేస్తా అని జగన్ అప్పట్లో పెండ్ర వీరన్నకి మాట ఇచ్చారు. కాలం గడిచిపోయింది. జగన్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటిపోయింది. దీంతో.., పెండ్ర వీరన్న కూడా ఈ కార్పొరేషన్ పై ఆశలు వదిలేసుకున్నాడు. కానీ.., జగన్ మాత్రం ఇచ్చిన మాట మరచిపోలేదు. ఇలా సంచార జాతుల వారందరికీ ఓ కార్పొరేషన్ ని ఏర్పాటు చేశారు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆరోజు తనని పాదయాత్రలో కలసిన వ్యక్తిని తీసుకుని రమ్మని ఆదేశించాడు. అలా పెండ్ర వీరన్న జగన్ ని కలిశారు. మీరు రెండేళ్లు క్రితం నన్ను పాదయాత్రలో కలిశారు. ఆరోజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తా అని మీకు మాటిచ్చాను. ఈరోజు మాట నిలబెట్టుకున్నాను. ఈ కార్పొరేషన్ కి మీరే ఛైర్మెన్ అని చెప్పడంతో పెండ్ర వీరన్న సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఒక్కసారి కలసి తమ గోడు వెళ్లబోసుకున్నందుకే జగన్ తమ జాతికి ఇంత సహాయం చేస్తారని పెండ్ర వీరన్న ఊహించలేకపోయారు. గుడిసెలో ఉండే తనకి అధికారం కట్టబెట్టడంతో ఆనందంతో కన్నీరు పెట్టేశారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజలు అంతా ఆమోదిస్తున్నారు. ఇలాంటి డేరింగ్ డెషిషన్స్ తీసుకోవడం జగన్ వల్లే సాధ్యం అంటూ నెటిజన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.