అనకాపల్లి సమీపంలోని రావికమతంలో పెళ్లి ఇష్టం లేదని పుష్ప అనే యువతి కాబోయే భర్త గొంతు కోసిందని ప్రచారం జరిగిన విషయం తెలిసిందే. సర్ ప్రైజ్ గిఫ్ట్ ఇస్తానని చెప్పి పుష్ప.. తన కళ్లకు గంతలు కట్టి కత్తితో గొంతు కోసినట్లు బాధితుడు ఆరోపించాడు. అయితే ఈ కేసులో పుష్ప తల్లి ట్విస్ట్ ఇచ్చింది. ఈ హత్యాయత్నంలో తమ పాపకు ఏ పాపం తెలియదంటూ, అతను చెప్పింది అబద్ధమని ఆ పుష్ప తల్లి తెలిపింది.
ఆ పుష్ప తల్లి మాట్లాడుతూ..”రామునాయుడే మా పాపను బయటకి తీసుకెళ్లాడు. పది నిమిషాల్లో వస్తామని చాలా దూరం వెళ్లారు. మా పాపకి ఫోన్ చేస్తే.. మేము రావిమతం వచ్చామని చెప్పింది. అయితే అంత దూరం ఎందుకు వెళ్లారు.. త్వరగా వచ్చేయమని చెప్పాను. కానీ.., ఫోన్ పెట్టేసిన 15 నిమిషాలకే యాక్సిడెంట్ అయిందని ఫోన్ వచ్చింది. ఆ తరువాత ఆ అబ్బాయి ఇలా మా అమ్మాయి తనపై దాడి చేసిందని అబద్దం చెప్పాడు. నిజానికి నా కుమర్తెకు ఏ పాపం తెలియదు. ఆమె అమాయకురాలు. రామునాయుడే మా అమ్మాయితో చాకు కొనిపించాడు. ముందుగా కొండపై నుంచి కిందకు దిగివస్తుంటే స్కూటీపై నుంచి పడి దెబ్బ తగిలిందని చెప్పారు.
ఇప్పుడు ఏమో నా కూతురే పీక కోసింది అని మాట మారుస్తున్నాడు. అతను చెప్పింది కరెక్ట్ కాదు. అసలు అతనితో బయటకి పోవడానికి నా కూతురు ముందుగా ఇష్టపడలేదు. అతడే మమ్మల్ని బ్రతిమలాడి పుష్పని బయటకి తీసుకెళ్లాడు. అలాటప్పుడు నా కూతురు అతని పీక ఎందుకు కొస్తుంది?” అని పుష్ప తల్లి ప్రశ్నిస్తోంది. మరోవైపు.. పుష్ప ప్లాన్ ప్రకారమే తమ కొడుకుపై దాడి చేసిందని రామునాయుడి తండ్రి ఆరోపిస్తున్నారు. ఈ మొత్తం కేసులో నిజానిజాలు ఏమిటి అన్నది తెలియాల్సి ఉంది. మరి.. ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.