నెలూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ‘జగనన్న మాట.. కోటంరెడ్డి బాట’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం 47వ రోజుకు చేరుకుంది. 47వ రోజు కార్యక్రమం నిర్వహిస్తుండగా కోటంరెడ్డి అస్వస్థతకు గురవ్వగా.. ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని చెన్నై ఆసుపత్రికి రిఫర్ చేశారు. అపోలో ఆసుపత్రిలో ఉన్న ఎమ్మెల్యేని మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి వెళ్లి పరామర్శించారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి మంత్రి వివరాలు తెలుసుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
“జగనన్న మాట – గడప గడపకు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాట” లో భాగంగా నేడు ఆమంచర్ల లోని గోటువారికండ్రిగ, మన్నవరప్పాడు లో పర్యటించడం జరిగింది.
ఆమంచర్ల గ్రామంలో ఇప్పటివరకు 9.03 కోట్ల రూపాయలతో సంక్షేమ పధకాలు, 4.05 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరిగాయి.#GadapaGadapakuKotamreddy pic.twitter.com/RWx8kD50cB
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_ycp) May 27, 2022
నిన్నటి “గడప గడపకు – మన ప్రభుత్వం” కార్యక్రమంలో భాగంగా ఆమంచర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని సిద్ధవరప్పాడు, సేవజ్యోతి కాలనీ మరియు మట్టెంపాడు లో పర్యటించడం జరిగింది. #GadapaGadapakuKotamreddy pic.twitter.com/rfqgAnQ9jY
— Kotamreddy Sridhar Reddy (@kotamreddy_ycp) May 27, 2022