అగ్నిసాక్షిగా మనువాడిన వారిని కాదని తాత్కాలిక సుఖాల కోసం పరుగులుపెట్టేవారు నిత్యం పెరిగిపోతున్నారు. కుటుంబ కలహాలచేతనో, ఆర్థిక స్థితి కారణంగానో, భార్యాభర్తల మధ్య సఖ్యత లేకపోవడం వల్లనో.. ఇలా అనేక కారణాల వల్ల మహిళలు పురుషులతో, పురుషులు మహిళలతో అక్రమ సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఒంటరిగా ఉన్న మహిళలు తోడు కోసం పాకులాడితే.., తమ అవసరాలు తీర్చే భాగస్వామి కోసం మగవాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా కొనసాగే బంధాలు వివాదాలతో ముగిసిపోతున్నాయి. చిన్న కారణాలే వారి సహజీవనాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. తాజాగా అక్రమ సంబంధాలపై జాతీయ కుటుంబ ఆరోగ్య శాఖ సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి.
దేశవ్యాప్తంగా 2020-21 మధ్య 15 ఏళ్ల నుంచి 49 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిపై నిర్వహించిన ఈ సర్వేలో దక్షిణాదిలో ఒక్కొక్కరు.. ఒకరి కంటే ఎక్కువ మందితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్లు తేలింది. ఇక తెలుగు రాష్ట్రాల మగాళ్లు ఈ విషయంలో కాస్త ముందున్నారనే చెప్పొచ్చు. తెలంగాణలో ఒక్కో పురుషుడు ముగ్గురితో లైంగిక సంబంధం కలిగి ఉన్నట్లు తేలితో.. ఏపీలో నలుగురితో లైంగిక సంబంధాలు కొనసాగిస్తున్నట్లు సర్వేలో బయటపడింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-5 రెండో విడతలో భాగంగా నిర్వహించిన ఈ సర్వేలో.. ఏపీలోని మహిళలతో పోలిస్తే పురుషులు ఎక్కువ మందితో సంబంధాలు కలిగి ఉన్నామని ఒప్పుకున్నారు.
ఇది కూడా చదవండి: Swetha Reddy: ప్రియుడ్ని చంపించిన శ్వేత కేసులో ఊహించని ట్విస్టు..
జీవితకాలంలో ఎంతమంది లైంగిక భాగస్వాముల్ని కలిగి ఉన్నారనే ప్రశ్నకు మహిళల సగటు 1.4గా ఉంటే పురుషుల సగటు 4.7గా ఉంది. మిగిలిన దక్షిణాది రాష్ట్రాల కంటే ఏపీలోనే పురుషులకు ఎక్కువ మంది స్త్రీలతో సంబంధాలు కలిగి ఉన్నారు. కర్ణాటకలో పురుషులు 2.7 మందితో, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ లో 2.8 మందితో, కేరళ, లక్షద్వీప్ రాష్ట్రాల్లో ఒక్కరితోనే లైంగిక సంబంధం ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. మరోవైపు పుదుచ్చేరిలో 1.2గా, తమిళనాడులో 1.8గా నమోదైంది.