టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79వ రోజుకి చేరుకుంది. 79వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 79వ రోజుకి చేరుకుంది. 79వ రోజు పాదయాత్ర ఆదోని నియోజకవర్గం కొనసాగింది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 నుంచి 1500 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా విడిది కేంద్రంలో 1500 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆదోని నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. నేడు స్థానిక స్వపరిపాలన అమలులోకి వచ్చిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవం సందర్భంగా అందరికి లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆయన మాట్లాడుతూ..” పల్లెటూరికి సేవ చేస్తే పరమాత్ముడికి సేవ చేసినట్టే. గతంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా గ్రామాలకు సేవ చేసే అదృష్టం నాకు దక్కింది. నాడు గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో చిత్తశుద్ధితో పనిచేస్తే నేడు వైసిపి ప్రభుత్వం గ్రామాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది” అని లోకేశ్ అన్నాడు. తుంబళం క్రాస్ వద్ద ‘పల్లె ప్రగతి కోసం మీ లోకేష్’ అనే కార్యక్రమం నిర్విహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుండి వచ్చిన సర్పంచులతో లోకేశ్ సమావేశం అయ్యారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచులో లోకేశ్ ను పలు రకాల ప్రశ్నలు అడిగారు. ఆయన కూడా ఎంతో ఒపికగా వారి ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. ఇప్పటి వరకూ నారా లోకేష్ 1,020 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈరోజు కూడా వివిధ వర్గాలతో సమావేశమయ్యారు. అలానే పెద్దలు, మహిళలను పలకరిస్తూ , యువతతో మమేకమవుతూ తన పాదయాత్రను కొనసాగించారు. మరి.. 79వ రోజు ఆదోని నియోజక వర్గంలో జరిగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.