టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 88వ రోజుకి చేరుకుంది. 88వ రోజు పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గంలోని లోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 88వ రోజుకి చేరుకుంది. 88వ రోజు పాదయాత్ర కోడుమూరు నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 నుంచి 1500 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. బుధవారం కూడా విడిది కేంద్రంలో దాదాపు 1500 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు కర్నూలు జిల్లాలో విశేష స్పందన వస్తోంది. లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కోడుమూరు నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది.
88వ రోజు కోడుమూరు నియోజవర్గం లో నుంచి యాత్ర ప్రారంభమైంది. కోడుమూరు హంపయ్య సర్కిల్ లో బుడగ జంగాల ప్రతినిధులు లోకేశ్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సామాజికర్గానికి న్యాయం చేస్తామని లోకేశ్ అన్నారు. అలానే ఎస్సీలకు వర్తించే సంక్షేమ పథకాలన్నింటినీ బేడ/బుడగ జంగాలకు వర్తింపజేస్తామని ఆయన తెలిపారు. కోడుమూరు మయూరి సెంటర్ లో స్థానిక ప్రజలు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు. అలానే కోడుమూరు విజయభాస్కర్ రెడ్డి కాలనీలో చేనేత సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి సమస్యలను విన్నవించారు.
ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శించారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అసమర్థ చర్యల కారణంగా చేనేతరంగం సంక్షోభంలో కూరుకుపోయిందని, టీడీపీ అధికారంలోకి రాగానే మగ్గాలున్న చేనేతలకు నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని ఆయన తెలిపారు. అలానే సిల్క్ సబ్సిడీ, ఆరోగ్య బీమాలను పునరుద్దరిస్తామని, కంప్యూటర్ జకాటీల కొనుగోలుకు రాయితీపై రుణసౌకర్యం కల్పిస్తామని లోకేశ్ హామి ఇచ్చారు. ఇలా ప్రజలతో మమేకమవుతు లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. మరి.. లోకేశ్ 88వ రోజు పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెట్స్ రూపంలో తెలియజేయండి.