టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 83వ రోజుకి చేరుకుంది. 83వ రోజు పాదయాత్ర ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 83వ రోజుకి చేరుకుంది. 83వ రోజు పాదయాత్ర మంత్రాలయం నియోజకవర్గం నుంచి ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతి రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. శుక్రవారం కూడా విడిది కేంద్రంలో 1000 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి నియోజవర్గ ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలో మంత్రాలయం నియోజవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. 83వ రోజు మంత్రాలయం నియోజవర్గంలో ప్రారంభమైన యాత్ర.. ఎమ్మిగనూరు నియోజక వర్గంలోకి ప్రవేశించింది. ఎమ్మిగనూరు నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేశ్ కి టీడీపీ ఇన్ ఛార్జీ బి.వి. జయ నాగేశ్వర్ రెడ్డి, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.
ప్రజలతో మమేకమవుతు.. వారి సమస్యలను వింటూ తన పాదయాత్రను లోకేశ్ కొనసాగించారు. మధ్యాహ్నం ఎమ్మిగనూరు నియోజకవర్గం మాచాపురంలో రైతులతో ముఖాముఖి సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక రైతులు తమ సమస్యలను లోకేశ్ కి తెలిపారు. టీడీపీ అధికారంలోకి రాగానే రైతుల సమస్యలు పరిష్కరిస్తామని లోకేశ్ హామి ఇచ్చారు. లోకేశ్ ను చూసేందుకు పొలంలో పనులు చేసుకుంటున్న మహిళలు వచ్చారు. ఆయన వారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని వారి సమస్యలను విన్నాడు. పాదయాత్రలో స్థానిక ఎమ్మెల్యేపై లోకేశ్ నిప్పులు చెరిగారు.
ఆయన మాట్లాడుతూ..”మంత్రాలయం ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి అలియాస్ విషనాగు అవినీతి ఆనవాళ్లు పాదయాత్రలో అడుగడుగునా కన్పిస్తున్నాయి. మంత్రాలయం నియోజకవర్గం గుడి కంబాల రీచ్ నుంచి రాష్ట్రేతర ప్రాంతాలకు తరలివెళ్తున్నాయి. నేను సాక్ష్యాధారాలతో బయటపెడుతున్న అక్రమాలపై సమాధానం చెప్పలేని వైసీపీ సైకోలు నాపై వ్యక్తిగత విమర్శలకు దిగడం దిగజారుడు తనానికి నిదర్శనం కాదా?” అంటూ లోకేశ్ ప్రశ్నించాడు. విషనాగులకు విరుగుడు మందు ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమేనని, ఆ మందే యువగళంలో ప్రజలు నాకిచ్చిన వరమని లోకేశ్ అన్నారు. అలా అధికార వైసీపీపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ తన పాదయాత్రను లోకేశ్ కొనసాగించారు. మరి.. 83వ రోజు ఎమ్మిగనూరులో జరిగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.