టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 76వ రోజుకి చేరుకుంది. 76వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని ములిగుందం విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 76వ రోజుకి చేరుకుంది. 76వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గం కొనసాగింది. నేడు ఆలూరు నియోజకవర్గంలోని ములిగుందం విడిది కేంద్రం నుంచి యువగళ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 నుంచి 1500 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా విడిది కేంద్రంలో 1500 మందికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. ములిగుందం విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నాయకుడు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. ఆలూరు నియోజవర్గంలోని ములిగుందం విడికి కేంద్రం నుంచి ప్రారంభమైన లోకేశ్ పాదయాత్ర ఆదోని నియోజవర్గంలోకి ప్రవేశించింది.
వివిధ గ్రామాల ప్రజలను కలసి వారి.. సమస్యలు అడిగి తెలుసుకుంటూ తన పాదయాత్రను లోకేశ్ కొనసాగిస్తున్నారు. మధ్యాహ్నం నాగలాపురంలో యువత తో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ పాల్గొన్నారు. ఆదోని నియోజకవర్గంలోకి ప్రవేశించిన నారా లోకేష్ నియోజవర్గ టిడిపి ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు, పార్టీ నాయకులు, కార్యకర్తల ఘన స్వాగతం పలికారు. అలానే ఆదోని నియోజకవర్గం పెద పెండేకల్ శివారు ఎర్రచెరువువంకలో ఉపాధి హామీ కూలీలను యువనేత కలిశారు. కూలీల వద్ద ఉన్న గడ్డపార తీసుకొని మట్టిని తవ్వుతూ వారి కష్టాలు తెలుసుకున్నారు.
ఆరేకల్ లో వాల్మీకి సామాజికవర్గీయులు యువనేత లోకేష్ ను కలిసి వినతిపత్రం సమర్పించారు. లోకేశ్ స్పందిస్తూ.. వాల్మీకిలకు న్యాయం చేసేందుకు తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉందని టిడిపి అధికారంలోకి వచ్చాక న్యాయం చేస్తామని తెలిపారు. అలానే రాష్ట్ర మంత్రి గుమ్మనూరు జయరాంపై నారా లోకేష్ తీవ్ర స్థాయిలో విరుచుకపడ్డారు. అలా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ లోకేశ్ తన పాదయాత్రను 76వ రోజు కొనసాగించారు. మరి.. 76వ రోజు ఆదోని నియోజక వర్గంలో జరిగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.