టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 75వ రోజుకి చేరుకుంది. 75వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని వలగొండ విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 75వ రోజుకి చేరుకుంది. 75వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గం కొనసాగింది. నేడు ఆలూరు నియోజకవర్గంలోని వలగొండ విడిది కేంద్రం నుంచి యువగళ పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈరోజు కూడా విడిది కేంద్రంలో 1000 మందికిపై అభిమానులకు లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. వలగొండ విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, ప్రజలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన వచ్చింది. ప్రస్తుతం కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతోంది. యువనేత లోకేశ్ ను వలగొండ గ్రామస్తులు కలిసి.. వారి సమస్యలు తెలియజేశారు.
లోకేశ్ స్పందిస్తూ.. “రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర వహించే మౌలిక సదుపాయాలను జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. వైసిపి అధికారంలోకి వచ్చాక రోడ్లు, డ్రైన్లు, వంతెన నిర్మాణాలు, సాగు, తాగు ప్రాజెక్టులు ఎక్కడివి అక్కడే నిలిచిపోయాయి. టిడిపి అధికారంలోకి వచ్చాక తుమ్మల వంక బ్రిడ్జి, వలగొండ నుండి పప్పులదొడ్డి వరకు రోడ్డు నిర్మాణాన్ని చేపడతాము” అని అన్నారు. అలానే కైరుప్పల గ్రామంలో రైతులను లోకేశ్ కలిశారు.
పాదయాత్రలో చిరుమాను దొడ్డి గ్రామానికి చెందిన ఖాంసింభీ యువనేతను కలుసుకుని తన కష్టాలను చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది. లోకేశ్ ఆమెను ఓదార్చి.. ఆదుకుంటానని హామి ఇచ్చాడు. మధ్యాహ్నం కారుమంచి లో బీసీ సామాజికవర్గం ప్రతినిధులతో లోకేశ్ భేటీ అయ్యారు. పాదయాత్రలోని లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చేరిగారు. మరి.. 75వ రోజు లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.