టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 74వ రోజుకి చేరుకుంది. 74వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని పల్లెదొడ్డి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 74వ రోజుకి చేరుకుంది. 74వ రోజు పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలోని పల్లెదొడ్డి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీ దిగే కార్యక్రమం ఉంటుంది. పల్లెదొడ్డి విడిది కేంద్రం వద్ద తనను కలిసేందుకు వచ్చిన యువతతో, టీడీపీ కార్యకర్తలతో లోకేశ్ ముచ్చటించారు. అలానే లోకేశ్ ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ వారికి సెల్ఫీ ఇచ్చారు. తన వద్దకు వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేశ్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాదయాత్రలో పాల్గొన్ని యువనేతకు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు తిరుపతి, చిత్తూరు, అనంతపురం, పుటపర్తి జిల్లాలో లోకేశ్ తన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం 74వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని ఆలూరు నియోజవర్గంలో కొనసాగుతుంది.
నేడు పల్లెదొడ్డి విడిది కేంద్రం నుంచి 74వ రోజు యువగళం పాదయాత్ర లోకేశ్ ప్రారంభించారు. పల్లెదొడ్డి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్ ని యువనేత పరిశీలించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. పాదయాత్రలో భాగంగా పల్లెదొడ్డి, గద్దెరాళ్ల గ్రామస్తులు లోకేశ్ ను కలిసి.. తమ సమస్యల తెలియజేశారు. వారి సమస్యపై లోకేశ్ మాట్లాడుతూ.. “ధనదాహంతో కొట్టుమిట్టాడుతున్న వైసీపీ నేతలకు ప్రజల దాహార్తి కనిపించడం లేదు. ప్రతి ఇంటికీ తాగునీరివ్వాలన్న లక్ష్యంతో జల జీవన్ మిషన్ పనులు వేగంగా చేశాం. జల్ జీవన్ మిషన్ నిధుల్ని జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడంలో విఫలమైంది.
టీడీపీ అధికారంలోకి రాగానే పైపులైను నిర్మాణం సత్వరమే పూర్తి చేసి, ఓవర్ హెడ్ ట్యాంక్ నిర్మించి తాగునీరిస్తాము. హంద్రీనీవా, పందికోన రిజర్వాయ్ నుండి రైతులకు సాగునీరు అందించే చర్యలు తీసుకుంటాము. గ్రామాల్లో అవసరమైన రోడ్లు నిర్మిస్తాం. అలానే అవసరమైన ప్రదేశాల్లో బస్టాండ్ నిర్మిస్తాము” అని లోకేశ్ అన్నారు. వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభలో లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరి.. 74వ రోజు ఆలూరు నియోజకవర్గంలోని లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.