టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 71వ రోజుకి చేరుకుంది. 71వ రోజు పాదయాత్ర డోన్ నియోజకవర్గంలోని పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 71వ రోజుకి చేరుకుంది. 71వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలోని పొలిమేరమెట్ట విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీ దిగే కార్యక్రమం ఉంటుంది. పొలిమేరమెట్ట విడిది కేంద్రం వద్ద తనను కలిసేందుకు వచ్చిన యువతతో లోకేశ్ ముచ్చటించారు. అలానే లోకేశ్ ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, కార్యకర్తలను, అభిమానులను ఆప్యాయంగా పలకరించి సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ ఇవ్వడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలో లోకేశ్ తన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం లోకేశ్ పాదయాత్ర కర్నూలు జిల్లాలో కొనసాగుతుంది. 71వ రోజు లోకేశ్ పాదయాత్ర డోన్ నియోజకవర్గంలోకి ప్రారంభమై.. పత్తికొండలోకి ప్రవేశించింది.
ఈసందర్భంగా పత్తికొండ నియోజవర్గంలోని టిడిపి నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కి ఘనస్వాగతం పలికారు. అలానే పత్తికొండ టిడిపి ఇంఛార్జ్ కెఈ శ్యాంబాబు, కర్నూలు జిల్లా ముఖ్య నేతలు లోకేశ్ తో కలిసి పాదయాత్ర చేశారు. కలచట్ల గ్రామస్తులు యువనేత లోకేష్ ను కలిసి వారి సమస్యలు విన్నవించారు. తమ గ్రామంలో అంతర్గత రోడ్లను తవ్వేసి వదిలేయడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, వేసవిలో తాగు, సాగునీటికి ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్థులు తెలిపారు. వారి సమస్యలపై లోకేశ్ స్పందించారు.
“జగమోహన్ రెడ్డి దోచుకోవడం, దాచుకోవడం తప్ప గ్రామాల అభివృద్ధిపై శ్రద్ధలేదు. టిడిపి హయాంలో రాష్ట్రవ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో 25వేల కి.మీ. సిసి రోడ్లు వేశాం. అలానే టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కలచట్ల చెరువుకు హంద్రీనీవా నీళ్లిస్తాం. గ్రామంలో ఇళ్లు లేని పేదలకు పక్కా గృహాలు నిర్మిస్తాం” అని లోకేశ్ అన్నారు. రాంపల్లి సర్కిల్ వద్ద బహిరంగ సభలో నారా లోకేశ్ వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. మరి.. 71వ రోజు పత్తికొండ నియోజకవర్గంలోని లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.