టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 70వ రోజుకి చేరుకుంది. 70వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలోని గుడిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 70వ రోజుకి చేరుకుంది. 70వ రోజు పాదయాత్ర కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలోని గుడిపాడు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీ దిగే కార్యక్రమం ఉంటుంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేశ్ తన పాదయాత్రను కొనసాగిస్తుంటారు. గుడిపాడు విడిది కేంద్రం వద్ద తనను కలిసేందుకు వచ్చిన యువతీ యువకులతో లోకేశ్ ముచ్చటించారు. అలానే ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, కార్యకర్తలను ఆప్యాయంగా పలకరించి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాలో తన పాదయాత్రను పూర్తి చేసుకున్నారు. గురువారం 69వ రోజు తాడిపత్రి నుంచి డోన్ నియోజకవర్గంలోకి రావడంతో పాదయాత్ర కర్నూలు జిల్లాలో ప్రారంభమైంది.
ఇక 70వ రోజు కర్నూలు జిల్లాలోని డోన్ నియోజకవర్గంలో పాదయాత్ర కొనసాగుతుంది. 70వ రోజు పాదయాత్ర గుడిపాడు విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. ఈయాత్రలో లోకేశ్ కి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. యాత్ర ప్రారంభంలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ రోజు సాయంత్రం ప్యాపిలి బీసీ కాలనీలో 900 కిలోమీటర్ల మైలురాయిని లోకేశ్ చేరుకున్నారు.
స్థానిక ప్రజలు నారా లోకేష్ ను కలిసి సమస్యలను చెప్పుకున్నారు. టీడీపీ ప్రభుత్వం రాగానే అన్ని సమస్యలు తీర్చుతామంటూ లోకేశ్ హామీ ఇస్తూ ముందుకు సాగుతున్నారు. లోకేశ్ ను గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య నాయకులు, పోతుదొడ్డి, మానుదొడ్డి గ్రామాలకు చెందిన మామిడి రైతులు నారా లోకేశ్ కలిసి.. తాము పడుతున్న బాధలను విన్నవించారు. పాదయాత్రలో వీఆర్ఎ సంఘ ప్రతినిధులు నారా లోకేశ్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.
లోకేశ్ స్పందిస్తూ..” రాష్ట్రంలో అన్ని రకాల ఉద్యోగులను జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేస్తూ సేవలందిస్తున్న విఆర్ఎల న్యాయమైన డిమాండ్లకు టిడిపి మద్దతు ఇస్తుంది. టిడిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విఆర్ఎల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాం” అని లోకేశ్ అన్నారు. మరి.. 70వ రోజు డోన్ నియోజకవర్గంలోని లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.