టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 69వ రోజుకి చేరుకుంది. 69వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 69వ రోజుకి చేరుకుంది. 69వ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలోని రాయలచెరువు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. రాయల చెరువు విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన నియోజకవర్గ యువత, అభిమానులతో లోకేశ్ కాసేపు ముచ్చటించారు. తన కోసం వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు భారీ స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర కొనసాగుతుంది. నేడు 69వ రోజు తాడిపత్రి నియోజవర్గంలోని రాయల చెరువు నుంచి యాత్ర ప్రారంభంమై.. కర్నూలు జిల్లాలోని డోన్ లోకి ప్రవేశించింది. తాడిపత్రి నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర జనసందోహంగా మారింది.
ఇక పాదయాత్రలో తాడిపత్రి మున్సిపల్ కౌన్సిలర్లు లోకేశ్ ను కలిశారు. ఈ సందర్భంగా తాడిపత్రి లో అధికార పార్టీ, పోలీసులు అధ్వర్యంలో జరుగుతున్న దౌర్జన్యాలను లోకేష్ దృష్టికి కౌన్సిలర్లు తీసుకెళ్లారు. ముఖ్యంగా తాడిపత్రి డీఎస్పీ చైతన్య యూనిఫామ్ తీసేసి వైసీపీ కండువా కప్పుకొని టీడీపీ నేతలు, కార్యకర్తలను వేధిస్తున్నారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. వారికి లోకేశ్ భరోసా ఇస్తూ అధికార పార్టీపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో విరుచకపడ్డారు. “ఇక్కడ జరుగుతున్న అరాచకాలు అన్ని నాకు తెలుసు. ఎవరిని వదిలిపెట్టను. కార్యకర్తలు, నాయకుల పై అక్రమ కేసులు పెట్టి వేధించిన వారు మూల్యం చెల్లించుకోక తప్పదు. న్యాయ విచారణ వేసి అధికారుల పై చర్యలు తీసుకుంటాము” అని లోకేశ్ అన్నారు.
చందన గ్రామం లోకేశ్ ని చూసేందుకు పెద్ద ఎత్తున రోడ్ల పైకి మహిళలు వచ్చారు. వారందరినీ కలుస్తూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే పన్నుల భారం, పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసర సరుకుల ధరలు తగ్గించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని లోకేశ్ అన్నారు. అలా ప్రజా సమస్యలు తెలుసుకుంటూ లోకేశ్ పాదయాత్ర తాడిపత్రిలో కొనసాగింది. మరి.. 69వ రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.