టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 68వ రోజుకి చేరుకుంది. 68వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోని పసలూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 68వ రోజుకి చేరుకుంది. 68వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోని పసలూరు విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. లోకేశ్ పాదయాత్రలో భాగంగా ప్రతిరోజు 1000 మందితో సెల్ఫీ దిగే కార్యక్రమం ఉంటుంది. సెల్ఫీల కార్యక్రమం తర్వాత లోకేశ్ తన పాదయాత్రను కొనసాగిస్తుంటారు. పసలూరు విడిది కేంద్రం వద్ద యువతీ యువకులతో లోకేష్ ముచ్చటించారు. అలానే ప్రతీ రోజూ తనని కలవడానికి వచ్చిన ప్రజలను, యువతను ఆప్యాయంగా పలకరించి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. లోకేశ్ ఓపికగా వచ్చిన అందరితో సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ బాబు చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. జనం పెద్ద సంఖ్యలో లోకేష్ పాదయాత్రలో పాల్గొంటున్నారు. యువనేతకు ప్రజలు, అభిమానులు, టీడీపీ కార్యకర్తలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. లోకేష్ ప్రస్తుతం ఉమ్మడి అనంతపురం జిల్లాలోని తాడిపత్రి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్నారు. ఇక, పాదయాత్ర 68వ రోజుకు చేరుకుంది. 68వ రోజు పాదయాత్ర పసలూరు విడిది కేంద్రంనుంచి ప్రారంభం అయింది. ఈయాత్రలో లోకేశ్ కి టీడీపీ కార్యకర్తలు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు. పాదయాత్రలో భాగంగా కొట్టాలపల్లి క్రాస్ వద్ద మిర్చి రైతులతో లోకేశ్ సమావేశమయ్యారు. అలానే వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
కమ్మవారి పల్లి వద్ద నిరుద్యోగులతో భేటీ అయిన లోకేశ్ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తుట్రపల్లి ఎస్సీ కాలనీలో వృద్ధులతో సమావేశమయ్యారు. తూట్రాలపల్లి గ్రామంలో రెడ్డి సామాజికవర్గంతో యువనేత నారా లోకేష్ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. “రాజకీయాల్లో రాజనీతి ఉండాలి..లక్ష్మణరేఖ దాటకూడదు. రెడ్డి సోదరులకు గౌరవం దక్కింది టీడీపీ పాలనలోనే జగన్ పాలనలో రెడ్డి సోదరులు కూడా బాధితులే. కాంట్రాక్టులు చేసిన రెడ్లు ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఏర్పడింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పేద రెడ్లను ఆదుకుంటాము. అలానే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను కూడా అమలు చేస్తామని” లోకేశ్ తెలిపారు.
రాయలచెరువులో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో యువనేత లోకేష్ ప్రసంగించారు. రాయలసీమ ముద్దుబిడ్డ అని చెప్పుకునే జగన్ కు రాయలసీమకు డ్రిప్ ఎంత ముఖ్యమో తెలియదా? డ్రిప్ ఎందుకు రద్దు చేశాడు? అంటూ లోకేశ్ ప్రశ్నించాడు. తాము అధికారంలో ఉండగా డ్రిప్ ను సబ్సిడీపై ఇచ్చామని నేడు ఆ ఫలితాలు చూస్తున్నామని ఆయన అన్నారు. జగన్ రెడ్డి సీఎం అయ్యాక డ్రిప్ రద్దు చేయడం వల్ల రైతులు నష్టాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దేశంలోనే ఏపీని రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానానికి తెచ్చాడంటూ లోకేశ్ విమర్శించారు. మరి.. 68వ రోజు తాడిపత్రి నియోజకవర్గంలోని లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.