టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 67వ రోజుకి చేరుకుంది. 67వ రోజు పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలో కొనసాగింది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 67వ రోజుకి చేరుకుంది. 67వ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలోని ఉలికుంటపల్లి విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో లోకేశ్ ప్రతీ రోజు సుమారుగా 1000 మందికి సెల్ఫీలు ఇస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో విడిది కేంద్రం వద్ద ప్రతిరోజు తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని కలిసి.. వారికి లోకేశ్ సెల్ఫీ ఇచ్చారు. ఉలికుంటపల్లి విడిది కేంద్రం వద్ద తనను కలవడానికి వచ్చిన నియోజకవర్గ యువతీ, యువకులు, అభిమానులతో లోకేష్ కాసేపు ముచ్చటించారు. తన కోసం వచ్చిన అందరితో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు విశేష స్పందన వస్తోంది. లోకేశ్ యువగళం పాదయాత్రలో జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, ప్రజలు, కార్యకర్తలు తమ మద్దతు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కంటే ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేశ్ పాదయాత్రకు మంచి స్పందన కనిపిస్తోంది. ప్రస్తుతం అనంతపురం జిల్లాలోని శింగనమల నియోజకవర్గంలో లోకేశ్ పాదయాత్ర చేస్తున్నారు. నేడు 67వ రోజు శింగనమల నియోజవర్గంలో నుంచి ప్రారంభమైన యాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నారా లోకేశ్, టీడీపీ ముఖ్య నాయకులు పూలమాల వేసి నివాళులర్పించారు. శింగనమల నియోజకవర్గంలో పూర్తయిన నారా లోకేష్ యువగళం పాదయాత్ర తాడిపత్రి నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా జేసీ ప్రభాకర్ రెడ్డి, జేసీ దివాకర్ రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు లోకేశ్ కు ఘన స్వాగతం పలికారు. యువనేత నారా లోకేష్ ను తాడిపత్రి నియోజకవర్గంలోని తబ్జుల, సింగనగుట్టపల్లె గ్రామస్తులు కలసి తమ సమస్యలపై వినతి పత్రం అందజేశారు.
చాగల్లు రిజర్వాయర్ వల్ల తమ గ్రామాలు ముంపుకు గురవుతున్నాయని, మా గ్రామాలకు ప్రభుత్వం నుండి రావాల్సిన ఆర్ అండ్ ఆర్ పరిహారం నేటికీ రాలేదని స్థానికులు తెలిపారు. తాము అధికారంలోకి వచ్చిన తరువాత వెంటనే మీ సమస్యలను పరిష్కరిస్తామని లోకేశ్ హామి ఇచ్చారు. వరదాయపల్లె బెస్త సామాజికవర్గ ప్రజలు యువనేత నారా లోకేష్ ను కలిసి.. తమ సమస్యలను వివరించారు. బెస్త సామాజికవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని లోకేశ్ హామి ఇచ్చారు. పెద్దపప్పూరు శివార్లలో దూదేకుల ముస్లీం ప్రతినిధులతో ముఖాముఖీ సమావేశంలో నారా లోకేశ్ పాల్గొన్నారు.
అలానే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో లోకేశ్ విరుచపడ్డారు. “టీడీపీ హాయంలో అభివృద్ది లో నంబర్ 1 గా ఉన్న తాడిపత్రి ఇప్పుడు అవినీతి లో నంబర్ 1 గా ఉంది. అప్పుడు తాడిపత్రి ఎలా ఉంది .ఇప్పుడు తాడిపత్రి లో ఏం జరుగుతుంది ఒక్క సారి ప్రజలు ఆలోచించాలి. నాపై 20కి పైగా కేసులు ఉన్నాయి. ప్రభాకర్ రెడ్డి గారిపై 70 కేసులు ఉన్నాయి. అయినా ప్రజల తరపున పోరాడుతున్నాం” అంటూ లోకేశ్ తెలిపారు. మరి.. 67 రోజు లోకేశ్ యువగళం పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.