టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకి చేరుకుంది. 100వ రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేవుల విడిది కేంద్రం నుంచి ప్రారంభమైంది. ప్రజలతో మమేకమవుతూ లోకేశ్.. తన పాదయాత్రను కొనసాగించారు.
తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర 100వ రోజుకి చేరుకుంది. 100 రోజు పాదయాత్ర శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతుంది. శ్రీశైలం నియోజకవర్గంలోని బోయరేపుల క్యాంప్ సైట్ నుంచి 100వ రోజు పాదయాత్ర ప్రారంభమైంది. ఈ పాదయాత్రలో నారా, నందమూరి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సోమవారం విడికేంద్ర వద్ద తనని కలవడానికి వచ్చిన ప్రజలు, అభిమానులు, కార్యకర్తల్ని లోకేశ్ కలిశారు. అలానే తన కోసం వచ్చిన అభిమానులతో, ప్రజలతో లోకేశ్ ఓపికగా సెల్ఫీ దిగడం పట్ల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు ప్రజల నుంచి భారీ స్పందన వస్తోంది. లోకేశ్ చేస్తున్న యువగళం పాదయాత్రలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. అలానే యువనేతకు అభిమానులు, కార్యకర్తలు, జనం తమ మద్దతు తెలియజేస్తున్నారు. దారి పొడవునా పూలు చల్లుతూ లోకేశ్ కి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మ రథం పడుతున్నారు. జనవరి 27న ప్రారంభమైన యువగళం పాదయాత్ర నేటికి 100 రోజులు పూర్తి చేసుకుంది. ప్రస్తుతం నంద్యాల జిల్లాలోని శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగతుంది.
100వ రోజు పాదయాత్రల్లో నారా, నందమూరి కుటుంబసభ్యులు పాల్గొన్నారు. నారా భువనేశ్వరి, ఇతర కుటుంబసభ్యులు లోకేశ్ తో కలిసి ముందుకు నడిచారు. మార్గంమధ్యలో తల్లి షూ లేస్ ఊడిపోవడంతో లోకేశ్ స్వయంగా కట్టారు. అలానే యువగళం పాదయాత్ర 100 రోజులు పూర్తైన సందర్భంగా మోతుకూరులో పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరించారు. బాణసంచా మోత, డప్పు చప్పుళ్లతో యువగళం పాదయాత్ర 100వ రోజు జాతరను తలపిస్తోంది. పాదయాత్ర 100 రోజులకు చేరుకున్న సందర్భంగా పెద్ద ఎత్తున తెదేపా కార్యకర్తలు, నందమూరి అభిమానులు తరలివచ్చారు. దీంతో బోయరేవుల క్యాంప్‌సైట్, మోతుకూరు పరిసరాల్లో 3.కి.మీ మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది.
ముత్తూకురు గ్రామ ప్రజలతో లోకేశ్ మాటమంతి నిర్వహించారు. అలానే పెద్దదేవలాపురం, సంతజూటూరు ప్రజలతో ముచ్చటించి.. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సంతజూటూరులో చెంచు సామాజికవర్గీయులతో ముఖాముఖి కార్యక్రమంలో లోకేశ్ పాల్గొన్నారు. వారి సమస్యలు తెలుసుకున్న లోకేశ్.. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని తె లిపారు. ఇలా బండి ఆత్మకూరు వరకు ప్రజలతో మమేకవుతు లోకేశ్ తన పాదయాత్రను కొనసాగించారు. మరి. 100వ రోజు శ్రీశైలం నియోజవర్గంలోని సాగిన లోకేశ్ పాదయాత్రపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.