ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు నిత్యం వాడీవేడీగా ఉంటున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఒకరిపైమరొకరు విమర్శినాస్త్రాలు సంధించుకుంటున్నారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికలనీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. కచ్చితంగా టీడీపీ గెలిచే తీరాలనే పట్టుదలతో తనదైన వ్యూహాలతో ముందుకు దూసుకుపోతున్నారు. ఒకవైపు అధికార పార్టీపై నిరసన కార్యక్రమాలు ఆందోళనలు చేపడుతున్నే మరోవైపు జిల్లా వారీగా సమావేశాలతో పార్టీ నేతలతో చంద్రబాబు భేటీ అవుతూ ఉన్నారు. అలానే ప్రభుత్వాపై రాష్ట్రవ్యాప్తంగా ‘బాదుడే బాదుడు’, ‘ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి’ పేరిట ఆందోళనలు, నిరసనలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా “ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా దెందలూరు సభలో పాల్గొన్న చంద్రబాబు ప్రసంగించారు. తనను, నారా లోకేష్ ని చంపేస్తారంట అంటూ సంచలన కామెంట్స్ చేశారు.
“ఇదేం ఖర్మ-మన రాష్ట్రానికి” కార్యక్రమంలో భాగంగా బుధవారం నుంచి మూడు రోజుల పాటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటన కొనసాగనుంది. ఇందులో భాగంగా బుధవారం దెందులూరులో నిర్వహించిన సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈక్రమంలో ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచక పడ్డారు. ఈ క్రమంలో తనను, లోకేష్ ను చంపేస్తారంట అంటూ సంచలన కామెంట్స్ చేశారు. తాము తలుచుకుంటే మొద్దుశ్రీనుని నా ఇంటికి పంపించివారమని రాయలసీమలో ఒకరు అన్నారు. ఇటీవల రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సోదరుడు చంద్రశేఖర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు గుర్తు చేశారు. జగన్, వారి నేతలకు పోలీసులుంటే తనకు ప్రజలున్నారని చంద్రబాబు అన్నారు.
చివరి అవకాశం తనకు కాదని ప్రజలని, ఇప్పటికైనా ప్రజలు మేల్కొవాలని చంద్రబాబు అన్నారు. తనకేం కొత్త చరిత్ర అవసరం లేదన్నారు. టీడీపీ సమావేశాలకు రావొద్దని బెదిరిస్తున్నారన్నారు. ప్రజల్లో చైతన్యతో ధైర్యంగా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు. ఈ తాటాకు చప్పుళ్లకు భయపడమని చంద్రబాబు తేల్చి చెప్పారు. కోతలతో విద్యాదీవెనను అమలు చేస్తున్నారని సీఎం జగన్ పై చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం నిర్వాసితులకు ఇంకా పునరావాసం దక్కలేదని ఆయన ఆరోపించారు. ఏదీ జరిగినా దానికి తానే బాధ్యుడినని వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతున్నారన్నారు.