టీడీపీ యువనేత నారా లోకేష్.. ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర.. జనవరి 27, శుక్రవారం ఉదయం 11.03గంటలకు ప్రాంరంభమైంది. కుప్పం నుంచి పాదయాత్ర ప్రారంభం అయ్యింది. యువగళం పాదయాత్ర తొలి రోజు నేపథ్యంలో.. టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. నటడు తారకరత్న కూడా తొలిరోజు పాదయాత్రలో పాల్గొన్నారు. ఇక యువగళం పాదయాత్ర ప్రారంభించడానికి ముందు.. లోకేష్ తన మామ బాలకృష్ణ, టీడీపీ నేతలతో కలిసి లక్ష్మీపురం వరదరాజస్వామి ఆలయంలో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్ర ప్రారంభించారు. కొద్ది దూరం యాత్ర కొనసాగించిన తర్వాత.. మసీదులో లోకేశ్ ప్రార్థనలు చేశారు.
లోకేష్‌తో పాటు నటుడు నందమూరి తారకరత్న కూడా మసీదులో ప్రార్థనలు చేశారు. మసీదు నుంచి బయటకు వచ్చే సమయంలో.. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. అభిమానుల తాకిడి తారకరత్న స్పృహతప్పి పడిపోయారు. తీవ్ర అస్వస్థతకు గురైన తారకరత్నను కుప్పం కేసీ ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన తర్వాత.. మెరుగైన వైద్యం కోసం పీఈఎస్ ఆస్పత్రికి తరలించారు. తారకరత్న అస్వస్థతకు గురైన విషయం తెలిసిన వెంటనే బాలాకృష్ణ ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు.
ఈ యువగళం పాదయాత్ర 400 రోజుల పాటూ 4 వేల కిలోమీటర్లు.. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు మొత్తం 125కు పైగా నియోజకవర్గాల్లో కొనసాగనుంది. 4000రోజులు జరిగే యాత్రకు ప్రస్తుతానికి 3 రోజులకు పర్మిషన్ లభించింది.