ఒకటో నంబరు కుర్రాడు సినిమాతో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన నందమూరి తారక రత్న.. కొన్ని సినిమాల తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నాడు. ప్రస్తుతం మళ్లీ మేకప్ వేసుకుని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఒరిజినల్స్ 9 హవర్స్ వెబ్ సిరీస్ లో నటించి మెప్పించాడు. ఈ వెబ్ సిరీస్ కు మంచి స్పందన లభిస్తోంది. అయితే చాలా రోజుల తర్వాత తారక రత్న ఇంటర్వ్యూలు ఇస్తూ ఎన్నో ఆసక్తికర విషయాలను ప్రేక్షకులు, అభిమానులతో పంచుకుంటున్నాడు. తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూలో సినిమాలు, తన పొలిటికల్ ఎంట్రీ, జనసేన పార్టీ గురించి తారక రత్న ఎన్నో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఆంధ్రప్రదేశ్ 2024 ఎన్నికల్లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనే ఉందని తారక రత్న తెలిపాడు. ప్రజల్లోకి వెళ్లి వారికి సేవచేయాలని ఉందని చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన మధ్య పొత్తు ఉండబోతోందా అనే ప్రశ్నకు.. పొత్తుల విషయంపై తనకు సమాచారం లేదని.. పొత్తుల విషయం చంద్రబాబు చూసుకుంటారని చెప్పుకొచ్చాడు. తారక రత్న మాట్లాడుతూ పవన్ కల్యాణ్ ను బాబాయ్ అని సంబోధించడం గమనార్హం.
ప్రజల కోసం పవన్ కల్యాణ్ కష్టపడుతున్నారని.. ఆయన స్థాయిలో ప్రజల కోసం పవన్ పని చేస్తున్నారని తారక రత్న అన్నాడు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ను పోటీదారులుగా తాను చూడటం లేదని స్పష్టం చేశాడు. చిన్నప్పటి నుంచీ పవన్ కల్యాణ్ సినిమాలు చూసి పెరిగినట్లు తారక రత్న తెలిపాడు. తాను, బాబాయ్, తారక్ టీడీపీ కోసం పని చేస్తామంటూ తారక రత్న క్లారిటీ ఇచ్చాడు. మామ్యయ చంద్రబాబు సూచనల మేరకు అందరూ ముందుకు సాగుతామంటూ తారక రత్న స్పష్టం చేశాడు. తారక రత్న వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.