ఎక్కడో విదేశాలలో ప్రారంభమైన ఓ రియాలిటీ షో మన దేశంలో ప్రారంభించి అన్ని భాషలలో విపరీతమైన క్రేజ్ ను సంపాదించుకొని సీజన్లుగా ప్రసారమవుతున్న బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ షో కి ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అన్ని భాషలలోను అధిక రేటింగ్స్ దూసుకుపోతూ ఎంతో విజయాన్ని అందుకున్న బిగ్ బాస్ ప్రతి ఒక్క భాషలోనూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షో ఇంత క్రేజ్ సంపాదించుకోవడానికి గల కారణం హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు చేసే సందడి ఒక కారణమైతే, బిగ్ బాస్ రియాలిటీ షో కు వ్యాఖ్యాతగా నిర్వహించే హోస్ట్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. బిగ్‌బాస్‌కు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు బిగ్‌బాస్ కూడా మంచి ప్రేక్షకాదరణతో దూసుకుపోతున్నది. అయితే బిగ్‌బాస్- 5 సీజన్‌కు ఈ సారి రానా హోస్ట్‌గా రాబోతున్నాడని వార్తలు వినిపించాయి. బిగ్‌బాస్ 3, 4 సీజన్లలో అక్కినేని నాగార్జున హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే.
రానా ఇప్పటికే నంబర్ వన్ యారీ వంటి టీవీ షోలు కూడా చేశాడు. దీంతో రానా బిగ్‌బాస్- 5కి హోస్ట్ చేస్తాడంటే బిగ్‌బాస్ ఫ్యాన్స్ సంతోషించారు. ప్రస్తుతం బిగ్‌బాస్ సెట్ వేస్తున్నారు. ఇక కంటెస్టెంట్లను కూడా ఎంపిక చేస్తున్నారు. ఇప్పటికే పలువురు యూట్యూబ్ స్టార్స్, సీరియల్ ఆర్టిస్టులకు ఫోన్ లు వెళ్తున్నాయి. తెర వెనక అప్పుడే బిగ్ బాస్ హడావుడి మొదలైంది. సెప్టెంబర్‌లో ఈ షో ప్రారంభమయ్యే చాన్స్ ఉంది. ఈ క్రమంలో ఈ షోలో చేసేందుకు రానా దగ్గుపాటి నిరాకరించినట్లు సమాచారం.
నిజానికి గతంలోనే బిగ్‌బాస్ షోతో రానా రెమ్యూనరేషన్ కూడా మాట్లాడుకున్నట్టు వార్తలు వచ్చాయి. రానా చెప్పిన పెద్ద అమౌంట్‌కు బిగ్‌బాస్ నిర్వాహకులు ఒప్పకున్నట్టు కూడా గుసగుసలు వినిపించాయి. చివరకు ఎక్కడ తేడా కొట్టిందో తెలియదు. మొత్తానికి మన నెంబర్ వన్ యారీ – రానా నో చెప్పాడు.